బంగాళాదుంప తింటే బరువు పెరుగుతాం....ఇది నిజామా....అపోహ....వాస్తవం తెలుసుకోండి

బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు.చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు.

బంగాళాదుంపతో చిప్స్,వేపుడు, కూర‌, వెజ్ బిర్యానీ వంటి ఎన్నో వంటలను తయారుచేస్తాం.అయితే కొంత మంది బంగాళాదుంప ఎక్కువగా తింటే బరువు పెరుగుతామని, ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు.

ఇప్పుడు దానిలో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.సాధారణంగా అందరూ బంగాళాదుంపను తొక్క తీసేసి తింటారు.

ఆలా కాకుండా తొక్క తీయకుండా వండుకొని తింటే చాలా మంచిది.బంగాళాదుంప తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

Advertisement

ఇది జీర్ణ సమస్యలను తగ్గించి ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.బంగాళాదుంపలో సంక్లిష్ట‌మైన పిండి పదార్దాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది.అందువల్ల మధుమేహం ఉన్నవారు కూడా బంగాళాదుంపను తినవచ్చు.

అయితే పరిమితంగానే తినాలి.బంగాళాదుంప ఎక్కువగా తింటే బరువు పెరుగుతామా అంటే తినే విధానంలో తింటే బరువు పెరిగే అవకాశం లేదు.

బంగాళాదుంప ను వేపుళ్ళు,చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తింటే మాత్రం బరువు పెరగటమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమే.బంగాళాదుంపను బేక్ చేసి లేదా ఉడికించి తింటే ఎటువంటి సమస్య ఉండదు.

మన ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీదేవి అసలు అడుగు పెట్టదు? మరి ఎలా ఉండాలో తెలుసా?
Advertisement