అందాన్ని ద్విగుణీకృతం చేసే ఆలుగడ్డ సబ్బు ఎలా తయారు చేస్కోవాలో మీకు తెలుసా?

బంగాళ దుంపల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే.

అలాగే మొహం మీద మచ్చలు వంటి వాటని తగ్గించుకునేందుకు కూడా ఆలుగడ్డను వాడుతుంటారు చాలా మంది.

 ఆరోగ్యాన్నే కాదు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బంగాళదుంప ప్రముఖ పాత్ర పోషిస్తుంది.చర్మంపై పేరుకుపోయిన నలుపును తొలగించి చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేయడంలో కూడా బంగాళదుంప మనకు చాలా బాగా ఉపయోగ పడుతుంది.

అయితే బంగాళ దుంపతో సబ్బును తయారు చేసుకోవచ్చు.అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక పెద్ద బంగాళదుంపను తీస్కొని దాన్ని ముక్కలుగా చేస్కోవాలి.ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

Advertisement

ఇలా మిక్సీ పట్టిన బంగాళదుంప మిశ్రమాన్ని వస్త్రంలో లేదా జల్లిగంటెలో వేసి రసాన్ని తురుముకోవాలి.తర్వాత మనం స్నానం చేయడానికి ఉపయోగించే సబ్బును తీస్కోవాలి.

రసాయనాలు తక్కువగా ఉన్న సబ్బును తీస్కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఈ సబ్బును మనం కూరయాగలను తురిమినట్లుగా చిన్న చేస్కొని ఇంతకు ముందు తయారు చేసి పెట్టకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

ఇందులోనే కలబంద గుజ్జు వేయాలి.టీ స్పూన్ బాదం నూనె వేయాలి.ఈ మిశ్రమం ఉన్న గిన్నెను.

మరుగుతున్న నీరు ఉన్న మరో గిన్నెలో వేసి ఐదు నిమిషాలు ఉంచుకోవాలి.తరచుగా కలుపుతూ ఉండాలి.

నల్లేరులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పూర్తిగా కలిసాక మనకు నచ్చిన ఆకృతిలో అచ్చు వేస్కోవాలి.దీన్ని 7 గంటల వరకు ఆరనివ్వాలి.

Advertisement

ఇలా తయారు చేసుకున్న బంగాళదుంప సబ్బు వల్ల ఆరోగ్యం చాలా మెరుగవుతుంది.మిలమిలా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు