లాంగ్ రైడ్స్ అంటే ఇష్టమా.. అయితే ఈ బైక్స్ మీకోసమే!

ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త బంధు లాంచ్ అవుతున్నాయి కానీ లాంగ్ రైడ్స్ చేసే వారికి మాత్రం ఇప్పటికీ ఆప్షన్స్ చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.

లాంగ్ రైడ్ ఇష్టపడే వారి కోసం హీరో, హోండా, బజాజ్, కెటిఎమ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఒక్కొక్క వెహికిల్ తీసుకొచ్చాయి.

వాటిలో బెస్ట్ మోటార్ సైకిల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.• డామినార్ 400బజాజ్ సంస్థ నుంచి విడుదలైన డామినార్ 400 బైక్ 373సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది.ఈ బైక్ 8,800 ఆర్‌పీఎమ్ వద్ద 39.4 బిహెచ్‌పి పవర్, 6,500 ఆర్‌పీఎమ్ వద్ద 35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.దీని ధర రూ.2.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.• యెజ్డీ అడ్వెంచర్యెజ్డీ అడ్వెంచర్‌ బైక్ తన అద్భుతమైన డిజైన్‌తో చాలామందిని ఆకట్టుకుంటుంది.

ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 334సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ఆఫర్ చేశారు.ఇది 30 బిహెచ్‌పి పవర్, 29.9 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.లాంగ్ రైడర్స్ కోసం దీనిలో 15.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఆఫర్ చేశారు.

• రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ బైక్‌ను విదేశీయులు కూడా మెచ్చుకున్నారు.దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రైడర్స్ కొనుగోలు చేస్తున్నారు.ఎందుకంటే దీనిపై రైడ్‌ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

Advertisement

ఇందులో 411సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్ అందించారు.దీని పవర్ 24.3 బిహెచ్‌పి ఉండగా.గరిష్ఠ టార్క్‌ 32 ఎన్ఎమ్ గా ఉంది.హిమాలయన్ బైక్ ధర రూ.2.14 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).• హీరో ఎక్స్‌పల్స్ 200 4విరూ.1.37 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర, 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌తో వచ్చే హీరో ఎక్స్‌పల్స్ 200 4వి చాలామందికి ఫేవరెట్ బైక్ అయిపోయింది.ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది.దీనిలో బైక్ 199.6సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ 4-స్ట్రోక్, 4-వాల్వ్ ఇంజన్‌ అందించారు.ఇది 18.9 బిహెచ్‌పి పవర్, వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.ఇంకా హోండా సిబి350ఆర్ఎస్, కేటీఎం డ్యూక్‌, కేటీఎం అడ్వెంచర్, మహీంద్రా మోజో వంటి బైక్స్ కూడా బెటర్ ఆప్షన్స్ అవుతాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement