ఎండాకాలంలో మీ పెదవులు ఎందుకు పగులుతాయో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది పెదవులు పగిలినప్పుడు( Cracked Lips ) లిప్ బామ్ పెడితే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు.

నిజానికి పెదవులు పగలడానికి ఎన్నో ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

వేసవికాలంలో పెదవులు పగలడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.చలికాలంలో పొడిగాలి వల్ల పెదవులు పగలడం సర్వసాధారణం.

కానీ సాధారణ పరిస్థితుల్లో కూడా పెదవులు పగిలి పోతే మాత్రం దాన్ని లైట్గా తీసుకోకూడదు.ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న కూడా పెదవులు పగులుతు ఉంటాయి.

Do You Know Why Your Lips Get Chapped In Summer , Cracked Lips , Vitamin Deficie

శరీరంలో పోషకాలు( Nutrients ) లోపించినప్పుడు కూడా పెదవులు పగిలే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి మన శరీరంలో ఏ ఏ పోషకాలు తగ్గితే పెదవులు పగులుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.పెదవుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.

Advertisement
Do You Know Why Your Lips Get Chapped In Summer , Cracked Lips , Vitamin Deficie

అందుకే చల్లగాలి, సూర్యలక్ష్మి వల్ల కూడా పెదవులు పగిలితాయి .అలాగే శరీరం అంతర్గత పరిస్థితులు కూడా దానిపై ప్రభావం చూపుతాయి.డిహైడ్రేషన్( Dehydration ) వల్ల కూడా పెదవులు ఎక్కువగా పగులుతూ ఉంటాయి.

అలాగే విటమిన్ బి లోపం వల్ల కూడా మన పెదవులు పగులుతాయని చెబుతున్నారు.

Do You Know Why Your Lips Get Chapped In Summer , Cracked Lips , Vitamin Deficie

నవ్వుతున్నప్పుడు నోటి మూలల్లో పగుళ్లు కనిపిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా విటమిన్ బి లోపం ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.విటమిన్ బి అనేది నీటిలో కరిగే విటమిన్ల సమూహం.ఇవి శరీరంలోని వివిధ కార్యకలాపాలకు ఎంతో అవసరం అవుతుంది.

మీ శరీరంలో ఈ, బి విటమిన్ లు లేకపోతే మీ పెదవులు పొడిబారుతాయి.ఈ విటమిన్ లోపం వల్ల పెదవుల పగుళ్లు ఏర్పడతాయి.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే మాంసాహారుల కంటే శాఖాహారులకే విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే విటమిన్ బీ ప్రధానంగా మాంసాహారంలోనే ఉంటుంది.

Advertisement

కొంత మొత్తంలో పాల ఉత్పత్తులు, గింజలు, ఆకుకూరల్లో కూడా ఉంటుంది.కానీ వీటిని మన శరీరం అంతా సులువుగా గ్రహించదు.

అందుకే మీరు డాక్టర్లను సంప్రదించి సప్లిమెంట్లను తీసుకోవాలి.అలాగే ఎక్కువగా పెదవులు పగులుతూ ఉంటే జింక్, ఇనుము లోపం కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు