విజయదశమి రోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా..?

దసరా పండుగ( Dussehra )ను చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకుంటారు.ఇది ప్రతి ఏడాది ఆశ్వాయుజ మాసంలో శుక్లపక్షంలోని పదవరోజు జరుపుకుంటారు.

శ్రీరాముడు ఈ రోజునే రావణున్ని సంహరించాడు.ఈ సంవత్సరం దసరా పండుగను ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం.

దసరా రోజు రావణ దహనానికి ప్రదోషకాల ముహూర్తం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.శుక్లాపక్ష దశమి తిధి సాయంత్రం 5:44 నిమిషాల నుంచి అక్టోబర్ 24 మధ్యాహ్నం 3:14 నిమిషముల వరకు ఉంటుంది.ఈ ఏడాది విజయదశమి పండుగను అక్టోబర్ 24వ తేదీన జరుపుకుంటారు.

ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య రావణ దహనం నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.

Advertisement

దసరాకు ఒక రోజు ముందు శాస్త్ర పూజ నిర్వహిస్తారు.శ్రీరాముడు రావణుడిని చంపడానికి ముందు తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని పూజించి పదవరోజు రావణుడిని వధించాడని పురాణాలు చెబుతున్నాయి.దసరా రోజున విజయ ముహూర్తం పూజకు ఉత్తమమైనది.

అక్టోబర్ 24 మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల 49 నిమిషముల వరకు విజయ ముహూర్తం ఉంటుందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే దసరా పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు.

ఇంకా చెప్పాలంటే విజయదశమి 10వ రోజు రాముడు రావణుని పై గెలిచిన సందర్భంగా చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజని పురాణాలలో ఉంది.అందుకే దసరా పండుగ రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు.

శివుని( Lord shiva ) తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించిన ఆమెకు 18 బహువులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడి పాశము, బ్రహ్మదేవుడి ఆక్షమాల,కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు.ఇలా సర్వ దేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
వీడియో వైరల్.. పాకిస్థానీయుడికి లెఫ్ట్.. రైట్.. ఇచ్చిపడేసిన భారత్ క్యాబ్ డ్రైవర్..

మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బీడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునీతో తలపడినది.ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది.

Advertisement

ఈ విధంగా అప్పటి నుంచి మహిషుని సంహరించిన దినమును దసరా పర్వదినంగా జరుపుకుంటున్నారు.

తాజా వార్తలు