శ్రీ‌రాముడికి నైవేద్యంగా వ‌డ‌ప‌ప్పు, పాన‌కమే ఎందుకు పెడతారో తెలుసా?

ప్ర‌తి సంవ‌త్స‌రం చైత్ర మాసం, శుక్లపక్ష నవరాత్రుల్లో వచ్చిన నవమి తిథిన శ్రీ‌రామ‌న‌వ‌మి( Sri Rama Navami ) జ‌రుపుకుంటారు.2025లో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ‌రామ‌న‌వ‌మి వ‌చ్చింది.

హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన, భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది.శ్రీ‌రామ‌న‌వ‌మి నాడు ఊరు-వాడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రామపట్టాభిషేకాలు, సీతా రాముల కళ్యాణాలు ఎంతో ఘ‌నంగా ర్వహిస్తారు.అలాగే ఈ శుభవేళ శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం,( Bellam Panakam ) వడపప్పు( Vadapappu ) నైవేద్యంగా స‌మ‌ర్పించి.

ఆపై భ‌క్తులంద‌రికీ ఆ ప్ర‌సాదాన్ని పంచిపెడ‌తారు.అస‌లు శ్రీ‌రాముడికి నైవేద్యంగా వ‌డ‌ప‌ప్పు, పాన‌క‌మే ఎందుకు పెడ‌తారో తెలుసా? తియ్య‌టి రుచిని క‌లిగి ఉండే పానకాన్ని భక్తి, ప్రేమ, అనురాగానికి ప్రతీకగా భావిస్తారు.పానకం పరమం తుల్యం అంటూ కొన్ని గ్రంథాల్లో పానక సేవనాన్ని అత్యుత్తమంగా పేర్కొన్నారు.

అలాగే వడపప్పును నాన‌బెట్టిన‌ పెసరపప్పు, కొబ్బరి తురుము, మిరియాల పొడితో త‌యారు చేస్తారు.వ‌డ‌ప‌ప్పు సాదాసీదా ఆహారం.

మ‌రియు సాత్వికతకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

Advertisement

ఆ కోదండరాముడు సాదాసీదా జీవితం గడిపిన ఆదర్శ పురుషుడు.కాబట్టి ఆయనకు అలాంటి సులభమైన, పవిత్రమైన నైవేద్యం సమర్పిస్తారు.అంతేకాకుండా శ్రీరామనవమి ఎప్పుడూ చైత్రమాసంలో అంటే వేసవికాలం ప్రారంభంలో వస్తుంది.

స‌హ‌జంగానే ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.దీనిని శాంతపరచేందుకు పానకం వంటి శీతల పానీయాలు ఎంతో మంచివి.

పైగా బెల్లం పాన‌కం శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తుంది.దాహాన్ని త‌గ్గిస్తుంది.

డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

వడపప్పు కూడా శరీరాన్ని తేలికగా ఉంచుతుంది.జీర్ణక్రియకు మేలు చేస్తుంది.శరీర అభివృద్ధి, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది ఇస్తుంది.

Advertisement

మలబద్దకం నివారణకు సహాయపడుతుంది.పానకం, వడపప్పు ప్రసాదంగా తిన‌డంలో ఆరోగ్య పరంగా ఎంతో ప్రయోజనం ఉంది.

ఆధ్యాత్మికంగా రాముని సాదాసీదా జీవనశైలికి గుర్తుగా వాటిని సమర్పించడం ఆనవాయితీగా మారింది.శ్రీ‌రామ‌న‌వ‌మి నాడు నైవేద్యంగా పెట్టే వ‌డ‌ప‌ప్పు, పాన‌కం భక్తులు తమలోని రాగద్వేషాలను తొల‌గించి, ప్రశాంతతను పొందాలని సూచిస్తుంది.

తాజా వార్తలు