Devattani Ekadashi : దేవత్తనీ ఏకాదశి నాడు తులసిని ఎందుకు తాకకూడదో తెలుసా..?

ప్రతి ఏటా కార్తీక మాసం శుక్లపక్షంలోనే ఏకాదశి తిధినాడు దేవత్తని ఏకాదశి వస్తుంది.అయితే ఈరోజు విష్ణుమూర్తి నిద్ర నుంచి మేలుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి.

దీంతో తులసి మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెప్పబడింది.తులసి లేకుండా విష్ణుమూర్తి ఆరాధన అసంపూర్ణంగా ఉంటుంది.

అందుకే ఆదివారం ఏకాదశి మాసం ఆదివారం రోజు తులసిని తాకకూడదు.అలాగే తులసి యొక్క ఆకులు కూడా తెంపకూడదు.

తులసికి నీరు కూడా పోయకూడదు.ఇలా చేస్తే అశుభం అని పండితులు చెబుతున్నారు.

Advertisement
Do You Know Why Tulsi Should Not Be Touched On Devattani Ekadashi , Tulsi , Devo

అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.దేవత్తని ఏకాదశి నవంబర్ 4 వచ్చింది.

ఆ రోజు విష్ణుమూర్తి 4 నెలల నుండి నిద్రలో నుంచి మేల్కొంటాడు.దేవత్తని ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి శంఖం, గంటా ఊదుతూ మేల్కొలుపుతారు.

దేవత్తని ఏకాదశి మరుసటి రోజు తులసి వివాహం చేస్తారు.అలాగే ఆ తర్వాత అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి.

ఈ ఏకాదశి నాడు తులసికి ఎంతో విశిష్టత ఉంది.తులసి మహావిష్ణు కు చాలా ఇష్టమైనది.తులసి లేకుండా విష్ణు పూజ కూడా నిర్వహించరు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025

అందుకే తులసిని లక్ష్మీదేవిగా అందరూ నమ్ముతారు.

Do You Know Why Tulsi Should Not Be Touched On Devattani Ekadashi , Tulsi , Devo
Advertisement

తులసి మొక్క నాటిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని అందరూ భావిస్తారు.ప్రతిరోజు తులసికి పూజిస్తారు.అయితే కొన్ని రోజుల్లో తులసికి నీరు పోయడం నిషిద్ధంగా చెప్పబడింది.

ఆదివారం ఏకాదశి రోజు నీరు పోయకూడదు.ఈ సమయంలో తులసికి నైవేద్యం పెడితే ఆ ఇల్లు నాశనం అవుతుందని మన పురాణలు చెబుతున్నాయి.

అసలు తులసికి నీరు ఎందుకు పోయకూడదంటే తులసి దేవి ఆదివారం నాడు మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది.ఈ రోజున నీటిని సమర్పిస్తే ఆమె ఉపవాసం భంగం కలుగుతుందని నమ్ముతారు.

ఆదివారం నాడు తులసికి నీరు సమర్పిస్తే ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి.అలాగే మీరు ఎన్నో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజా వార్తలు