పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత స్వస్తిక్ గుర్తును గంధంతో ఎందుకు రాస్తారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఆలయాలకు వెళ్లినప్పుడు దైవాన్ని కొలుస్తూ ప్రత్యేక పూజలు కూడా చాలా మంది ప్రజలు చేస్తూ ఉంటారు.

అయితే అంతకంటే ముందు తల వెంట్రుకలను కూడా సమర్పిస్తుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతికి వెళ్ళినప్పుడు తల వెంట్రుకలు( Head hair ) ఇవ్వకుండా మాత్రం తిరిగి రారు.అయితే కొంతమంది చిన్న పిల్లలకు పుట్టువెంట్రుకలను ముందుగా దైవ సన్నిధిలోనే తీస్తూ ఉంటారు.

పుట్టినప్పుడు వచ్చే వెంట్రుకలు దైవంతో సమానం అని భావించి చాలామంది ప్రజలు ఇలా చేస్తూ ఉంటారు.పుట్టు వెంట్రుకలు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తూ ఉంటారు.

పాప లేదా బాబు పుట్టు వెంట్రుకలను తన మేనమామ లేదా తాతయ్య ద్వారా తీసి వాటిని ఇలవేల్పుకు సమర్పిస్తూ ఉంటారు.అయితే పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత గుండుకు కొందరు గంధంతో స్వస్తిక్ గుర్తును( Swastik symbol ) రాస్తూ ఉంటారు.ఇలా రాయడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మనం చేసే ప్రతి మొదటి కార్యక్రమాన్ని దైవ సన్నిధిలో నిర్వహిస్తూ ఉంటాము.అలాగే మనం చేసే ప్రతి పూజకు ముందు వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాము.

గణనాధునికి పూజ( ganesh ) విధానాలు చేసినా తర్వాతే మిగతా దేవుళ్లను ఆరాధిస్తాము.అలా పాప లేదా బాబుకు పుట్టు వెంట్రుకలు మొదటిసారి తీస్తున్నప్పుడు వాటిని ఇష్టదైవానికి సమర్పించి ఆ చిన్నారి తల పై గంధంతో స్వస్తిక్ నామం రాస్తారు.

అలా గంధం పెట్టడం వల్ల తలకు చల్లదనాన్ని ఇస్తుంది.అలాగే చిన్న పిల్లల మెదడు చురుగ్గా పని చేస్తుంది.అందువల్ల గంధన్ని గుండుకు రాస్తారు.

ఇంకా చెప్పాలంటే చిన్నారి భవిష్యత్తు బాగుండాలని ఈ గుర్తును రాస్తారు.ఇలా రాయడం వల్ల తన జీవితంలో దైవం తోడు ఉండాలని ప్రజలు విశ్వసిస్తారు.

మహిళలు మర్రి చెట్టుకు పూజలు చేయడం వల్ల.. సంతాన సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు దూరం..!

ఇలా స్వస్తిక్ రాసిన ఆరు నెలల తర్వాత శిశువునకు అన్నప్రాసన్న చేస్తారు.ఆ తర్వాత సరిగ్గా సంవత్సరానికి శిశువుకు పుట్టు వెంట్రుకలు తీస్తారు.

Advertisement

పుట్టు వెంట్రుకలే కాకుండా ప్రతి శుభకార్యం లోనూ మొదటగా స్వస్తిక్ గుర్తు రాస్తారు.మనం ఎక్కువగా గృహప్రవేశాలలోనూ, షాపు ప్రారంభంలోనూ వీటిని గమనిస్తూ ఉంటాము.

తాజా వార్తలు