శనీశ్వరుడి దర్శనం అశుభంగా ఎందుకు భావిస్తారో తెలుసా..?

హిందూ ధర్మంలో ప్రతి రోజు ఏదో ఒక భగవంతునికి అంకితం చేయబడి ఉంటుంది.అలాగే శనివారం శనీశ్వరుడికి, కాలభైరవుడికి అంకితం చేయబడిందని పండితులు చెబుతున్నారు.

ఈ రోజున శనీశ్వరుడి( LORD Shani )ని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు పూర్తి ఆచారాలతో పూజిస్తారు.ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.

శనివారం రోజు భక్తులందరూ శనీశ్వరుడి దేవాలయానికి వెళ్లి శని దేవుడికి అవా నూనె లేదా నువ్వుల నూనె ను సమర్పిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే శని దేవుని గురువు స్వయంగా మహాదేవుడే.

మహాదేవుడి నుంచి శని దేవుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే వరం పొందాడని పండితులు చెబుతున్నారు.

Advertisement

అలాగే మానవుడు తను చేసే కర్మలను అనుసరించి శనీశ్వరుడు ఫలితాలను ఇస్తాడు.

అలాగే శనివారం ఉపవాసం చేయడం వల్ల ఎవరి జీవితం లోనైనా కీర్తి, సంతోషం, శ్రేయస్సు, శాంతి, అదృష్టం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.శనివారం రోజు శని దేవుడిని ఆరాధించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.

అలాగే శని దేవుడి దర్శనం ఎందుకు అశుభంగా భావిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.పురాణాల ప్రకారం సూర్యపుత్రుడు శనీశ్వరుడు చిత్రరధుని కుమార్తె దామినీ( Damini )ని వివాహం చేసుకున్నాడు.

ఒక సారి శనీశ్వరుడు శ్రీకృష్ణున్ని ఆరాధిస్తున్నప్పుడు అతని భార్య దామినీ కోరికతో భర్త వద్దకు వచ్చింది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అప్పుడు శనీశ్వరుడు ఎవరి గురించి పట్టించుకోనంతగా శ్రీకృష్ణుని( Lord krishna ) భక్తిలో మునిగిపోయాడు.ఆ సమయంలో శనీశ్వరుడు ధ్యానం నుంచి బయటకు రావడానికి ఇష్టపడ లేదు.అప్పుడు దాన్ని శనీశ్వరుడిని ధ్యానం నుంచి మేల్కొలపాలనే ప్రయత్నం చేసింది.

Advertisement

కానీ ఆమె ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.దీంతో ధమినికి కోపం వచ్చి, మీరు నన్ను ప్రేమగా చూడలేదు.

దీంతో కోపంతో మిమ్మల్ని ఎవరు చూసినా దురదృష్టం కలుగుతుందని, మిమ్మల్ని ఎవరు చూసినా కష్టాల బారిన పడతారని శాపంపించింది.దీని కారణంగా శని దృష్టి దోషంగా పరిగణిస్తారు.

తాజా వార్తలు