అశోకవనంలో బంధించిన సీతను రావణాసురుడు ఎందుకు తాకలేదో తెలుసా?

రామాయణం అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది సీతమ్మ స్వయంవరం, వనవాసం, వనవాసంలో సీతాదేవి అపహరణ, రావణాసురుడుతో యుద్ధం ఇవన్నీ మనకు గుర్తొస్తాయి.

ఇలా ఎన్నో పద్యాలు, శ్లోకాలు వంటి విషయాలు రామాయణంలో దాగి ఉన్నాయి.

వాటన్నింటి గురించి తెలుసుకోవాలంటే మనకు ఎంతో సమయం పడుతుంది.కానీ రామాయణంలో అత్యంత కీలకమైన భాగం సీతాదేవి అపహరణ.

అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లి అశోకవనంలో బంధించిన సంగతి మనకు తెలిసినదే.కానీ అన్ని రోజులు సీతాదేవిని రావణాసురుడు బంధించిన ఎప్పుడు కూడా సీతమ్మను తాకలేదు అందుకు గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంద్రుడు సభలో ఉండే రంభ తన నాట్యంతో అందరిని ఆకట్టుకుంటుంది.అయితే తన అందచందాలను చూసిన రావణాసురుడు ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని భావిస్తాడు.

Advertisement
Story Of Ravana Never Touched Sita, Ravanasura,sita Devi, Did Not Touch At Ashok

తనతో గడపాలని రావణాసురుడు రంభను ఒత్తిడి చేస్తాడు.అందుకు రంభ ఒప్పుకోకపోవడంతో ఆమె వెంటపడి ఆమెను బలవంత పెడుతుంటాడు.

ఈ క్రమంలోనే రంభ ప్రియుడు నల్ల కుబేరుడు రావణాసురుడికి ఒక శాపం పెడతాడు.

Story Of Ravana Never Touched Sita, Ravanasura,sita Devi, Did Not Touch At Ashok

ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే అతని తల పగిలిపోతుందనే శాపాన్ని పెడతాడు.ఈ శాపం కారణంగా చేసేదేమీలేక రావణాసురుడు రంభ విషయంలో వెనక్కి తగ్గుతాడు.తరువాత కొంతకాలానికి అరణ్యవాసం చేస్తున్న సీతాదేవి ఎదుట మారు వేషంలో వచ్చి తనను అపహరించి వెళ్తాడు.

సీతా దేవుని ఎత్తుకెళ్లి అశోకవనంలో బంధించిన రావణాసురుడు ఏ రోజు కూడా సీతాదేవిని తాకలేదు.

Story Of Ravana Never Touched Sita, Ravanasura,sita Devi, Did Not Touch At Ashok
టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

నల్ల కుబేరుడు శాపం కారణంగా రావణాసురుడు ఆమెను తాకకుండా కేవలం అశోకవనంలో బంధించి ఉంటాడు.తరువాత హనుమంతుడి సహాయంతో సీతాదేవి జాడను కనుగొన్న శ్రీ రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి యుద్ధంలో రావణాసురుని సంహరించి సీతను తీసుకుని సతీసమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు.ఈ శాపం కారణంగానే సీతాదేవిని తాకడానికి రావణాసురుడు భయపడతాడు.

Advertisement

తాజా వార్తలు