Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో ఆ ఒక్క సీన్ ను ఎందుకు కట్ చేయించాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆయన ఒక సినిమా కనక చేశాడు అంటే మాత్రం ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది.కానీ ఆయన చేసే సినిమాల్లో కథ కరెక్ట్ గా కుదిరితే మాత్రం ఆ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించటమే కాకుండా ఇండస్ట్రీ హిట్ కూడా కొడుతుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఒక పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమాతో ఒకభారీ హిట్ అయితే దక్కింది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోతున్నాయి.కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్ సినిమా( Gabbar Singh )లో ఒక సీన్ ని పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ రూమ్ లో దగ్గరుండి మరి కట్ చేయించారంట.అది ఏంటి అంటే వాళ్ల అమ్మ అయిన సుహాసినిని రౌడీలు బాగా హింసించి చంపేసిన సీన్ ఒకటి షూట్ చేశారంట.

Advertisement

అయితే ఆ సీన్ చూడ్డానికి చాలా ఇబ్బందిగా కనిపించడంతో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్( Harish Shankar ) ని పిలిచి ఆ సీను మరి టార్చర్ పెట్టి చంపినట్టుగా ఉంది.

అలా వద్దు జస్ట్ ఆమెని చిన్న రీజన్ తో చంపినట్టుగా పెట్టి చెయ్ అన్న తర్వాత మళ్లీ అప్పుడు చిన్న రీజన్ పెట్టుకొని చంపినట్టుగా చూపించాడు.ఆమెకి ఆస్తమా ఉంది కాబట్టి కవర్ మొహం మీద వేసి ఆమెకి ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్టుగా ఆ షాట్ ని తీశారంట.అలా మొత్తానికైతే రీ షూట్ చేసిన తర్వాత సీన్ సూపర్ గా రావడం ఆ సినిమా లో ఎమోషన్ కి బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు