నవరాత్రులలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదో తెలుసా..?

దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు ( Devi Sharannavaratra )వైభవంగా సాగుతున్నాయి.అయితే అమ్మవారిని భక్తులు ( Devotees )ప్రత్యేక నియమ, నిష్టలు, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

నవరాత్రుల వేళ ప్రధానంగా ఉల్లిపాయ, వెల్లుల్లి భక్తులు తినకూడదని అంటారు.అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

నవరాత్రుల సమయాల్లో భక్తులు అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో రోజు అలంకరించి భక్తిశ్రద్ధలతో విశిష్ట పూజలు చేస్తారు.అయితే దేవి అనుగ్రహం పొందాలంటే భక్తులు ఈ తొమ్మిది రోజులు కొన్ని నియమాలను పాటిస్తారు.

ప్రధానంగా కొన్ని ఆహార పదార్థాలకు భక్తులు దూరంగా ఉండాలి.అందులో ప్రధానంగా ఉల్లిపాయ, వెల్లుల్లినీ( Onion and garlic ) నిషేధించాలి.

Do You Know Why Onion And Garlic Should Not Be Eaten During Navratri , Devi Shar
Advertisement
Do You Know Why Onion And Garlic Should Not Be Eaten During Navratri , Devi Shar

ఉల్లిపాయ, వెల్లుల్లిని ఎందుకు నివారించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ఉపవాస సమయంలో సాత్విక ఆహారం ఉత్తమమైనది అని ఆయుర్వేద నిపుణులు నమ్ముతారు.ఎందుకంటే ఆ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

ఉపవాసం చేసే సమయంలో ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది.అదే సాత్విక ఆహారం తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి ( Immunity )కూడా మెరుగుపడుతుంది.అంతేకాకుండా చర్మం,జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా ఆ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.కాబట్టి నవరాత్రుల సమయంలో తినే ఆహారంలో నియమ నిబంధనలు అనుసరిస్తూ ఆహార పదార్థాలను వండడం, తినడం సాంప్రదాయ ఆచారంగా వస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

అయితే ఈ సాత్విక ఆహారం అంటే ఏమిటి? ఉల్లుల్లి, వెల్లుల్లి ( Onion and garlic )ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Why Onion And Garlic Should Not Be Eaten During Navratri , Devi Shar
Advertisement

ఆయుర్వేదం ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తుంది.సాత్విక్, రాజసిక్, తామసిక్ అనే మూడు రకాల ఆహార పదార్థాలుగా పేర్కొన్నారు.అయితే సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంతమైన ఆహారం అని అర్థం.

ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకలు, పప్పులు, తేనె లాంటి తాజా మూలికలు ఉంటాయి.ఇవి మనసును స్వచ్చంగా, శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి.ఇక రాజసిక్ అంటే కాఫీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.

కానీ వెంటనే ఖర్చయిపోతుంది.జీర్ణ వ్యవస్థ( Digestive system ) బలహీనమైపోతుంది.

అలాగే శరీర సమతుల్యత కూడా భంగపరుస్తుంది.కాబట్టి ఉపవాస సమయంలో ఉల్లిని,వెల్లుల్లిని తీసుకోకూడదు.

తాజా వార్తలు