తినేటప్పుడు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయో తెలుసా? కారణం ఇదే..

అన్నం తినే సమయంలో చాలా మందికి ఎక్కిళ్లు వస్తాయి.వాటిని ఆపేందుకు కాసిన్ని నీళ్లు తాగాలని చెబుతుంటారు పెద్దలు.

ఎవరో తలచుకుంటున్నారని, అందుకే ఎక్కిళ్లు వస్తున్నాయని చాలా మంది అంటుంటారు.కానీ దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ను కనిపెట్టారు శాస్త్రవేత్తలు.

ఎక్కిళ్లు వచ్చే కారణాలను వివరించారు.వాటిని ఎలా నివారించాలో కూడా చెప్పుకొచ్చారు.

మనలోని కండరాల అసంకల్పిత చర్యల వల్ల ఎక్కిళ్లు వస్తాయని చెబుతున్నారు.డయాఫ్రాగమ్ కండరాలు ఉన్నట్టుంది కుదింపులకు గురైతే ఆ సమయంలో దానిని నియంత్రించలేరు.

Advertisement
Do You Know Why Hiccups Occur When Eating This Is The Reason Hiccups, Viral N

అప్పుడు ఎక్కిళ్లు వస్తుంటాయి.కొంత సమయం అయిన తర్వాత అవి ఆగిపోతుంటాయి.

కానీ ఫాస్ట్ గా ఆహారం తినడం వల్ల ఎక్కిళ్లు వస్తాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు.అయితే వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు డాక్టర్లు.

ఇలా వచ్చిన ఎక్కిళ్లు కొద్ది సేపటి తర్వాత ఆగిపోతాయట.కానీ కొన్ని సమయాల్లో ఆగకుండా ఎక్కిళ్లు వస్తే అది సమస్యగా మారే ప్రమాదం ఉందని, ఆ టైంలో డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

Do You Know Why Hiccups Occur When Eating This Is The Reason Hiccups, Viral N

ఎక్కిళ్లు వచ్చినప్పుడు వాటిని ఆపేందుకు చాలా మంది శ్వాసను కాస్త ఆపుతూ ఉండాలి.చల్లని నీరు తాగాలి.వీటిని ఆపేందుకు సౌకర్యంగా ఉన్న ప్లేస్ లో కూర్చొని, చాతికి మోకాళ్లు ఆనిస్తూ కాసేపు అలాగా కూర్చోవాలి.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

ఎక్కిళ్లు తగ్గకుండా అలాగే వస్తుంటే నాలుకను బయటకు తీసి ఉంచాలి దీని వల్ల ఎక్కిళ్లు ఆగే చాన్స్ ఉంది.ఎక్కిళ్ల పై నుంచి దృష్టి మరల్చి కొంత సేపు వేరే పనిలో లీనమవడం వల్ల ఎక్కిళ్లు ఆగిపోతాయి.

Advertisement

మరి మీకు ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఇలాంటి చిట్కాలు ట్రై చేయండి.ఎక్కిళ్లు ఎంతకీ ఆగకుంటే డాక్టర్ వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు తీసుకోవడం బెటర్.

తాజా వార్తలు