శుభకార్యాలలో రెండు వత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

మన హిందూ ధర్మం ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము.

ప్రతి ఆచారం వెనుక ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.

ఇందులో భాగంగానే దీపారాధన చేయడానికి ఉపయోగించే వత్తుల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెబుతుంటారు.దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులను వెలిగించాలని,మూడు వెలిగించాలని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు.

అయితే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Do You Know Why A Lamp Is Lit With Two Wicks In Good Deeds Lamp Is Lit- With Two

మన సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలు పెడతారు.అయితే శుభకార్యం చేసే సమయంలో మనం దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా రెండు వత్తులను వేసి వెలిగించాలి.ఈ రెండు వత్తులలో ఒకటి జీవాత్మ, రెండవది పరమాత్మ.

Advertisement
Do You Know Why A Lamp Is Lit With Two Wicks In Good Deeds Lamp Is Lit- With Two

కనక దీపారాధన చేసే సమయంలో కచ్చితంగా రెండు వత్తులను వేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా మనిషి మరణించినప్పుడు వారి తల దగ్గర ఒక వత్తి వేసి దీపం వెలిగించాలి.

ఎందుకంటే జీవుడు పరమాత్మలో కలిశాడు కాబట్టి ఇక్కడ ఒకే వత్తిని వెలిగిస్తారు.దీపం సూర్యుడికి ప్రతీక, దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.

దీపం నూనెను ధరించినట్లే, మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి దీపం వెలుతురులాగ మన జీవితం కూడా వెలుగుతుందని ఈ దీపారాధన చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం.ఏ ఇంట్లో అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు.

తూర్పు ముఖంగా దీపారాధన చేయటం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, ఉత్తర దిశగా దీపారాధన చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది.నాలుగు దిక్కుల దీపారాధన చేయడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

తల్లి తన బిడ్డని పూజించవచ్చా ? పార్వతిదేవి గణపతిని ఎందుకు పూజించింది ?

ఒకవేళ ప్రతి రోజు దీపారాధన చేయడం వీలు కాని వారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు