JR NTR : జూనియర్ ఎన్టీయార్ కి బాగా నచ్చిన నటుడు ఎవరో తెలుసా..?

నందమూరి ఫ్యామిలీ లో మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఎన్టీఆర్( JR NTR ) ఆయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వచ్చాడు.ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.

Do You Know Who Is The Actor That Jr Ntr Likes The Most

అయితే జూనియర్ ఎన్టీఆర్ విభిన్న పాత్రలు చేసినప్పటికీ తన చేయాల్సిన పాత్రలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి అనే చెప్తూ ఉంటాడు.ఇక ఇదిలా ఉంటే ఆయనకు నచ్చిన నటులలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు అయినప్పటికీ ఆయన కాకుండా తనకు నచ్చిన నటులలో ప్రకాష్ రాజ్ ఒకరట. ప్రకాష్ రాజ్( Prakash RAJ ) తండ్రిగా, విలన్ గా, అన్నగా, తాతగా ఏ పాత్ర లో అయిన నటించి మెప్పించే సత్తా ఉన్న నటుడు కావడం వల్లే తన యాక్టింగ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

అందుకే తన సినిమాల్లో ఎక్కువగా ప్రకాష్ రాజ్ ఉండేవిధంగా ప్లాన్ చేసుకుంటారట.ఎందుకంటే టాలెంటెడ్ నటులతో పని చేసినప్పుడే మన టాలెంట్ కూడా బయటకు వస్తుందని ఎన్టీఆర్ బాగా నమ్ముతాడు.

Do You Know Who Is The Actor That Jr Ntr Likes The Most

కాబట్టే తను చేసిన చాలా సినిమాల్లో ప్రకాష్ రాజ్ ను కూడా తీసుకోమని డైరెక్టర్లకి రిఫర్ చేస్తాడట.ఆయన చేసిన అశోక్, ఊసరవెల్లి, కంత్రి, బృందావనం,టెంపర్ ( Temper )లాంటి పలు చిత్రాలలో ప్రకాష్ రాజ్ ను తీసుకోమని డైరెక్టర్లకి ముందే చెప్పాడట.నిజానికి ఎన్టీఆర్ చెప్పినట్టుగానే ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ ఉన్న సినిమాల్లో వీళ్లిద్దరీ కాంబోలో వచ్చే సీన్స్ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ ఉంటాయి.

Advertisement
Do You Know Who Is The Actor That Jr Ntr Likes The Most-JR NTR : జూని�

ఇద్దరూ నటనలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వారు కావడం వల్లే వాళ్ళిద్దరూ నటించే సీన్లను ఇద్దరు ఎక్కువగా ఎలివేట్ చేస్తారట.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు