దేవతామూర్తుల విగ్రహాలను ఎక్కడ.. ఎన్ని రోజులలో తయారు చేస్తారో తెలుసా..

దేవాలయాలలో ప్రతిక్షణం పూజలు అందుకుంటున్న దేవతల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

అయితే ఈ దేవతల విగ్రహాల తయారీ అంత సులువుగా అయ్యే పని మాత్రం కాదు.

ఇందుకోసం ఒక్కో శిల్పి కొన్ని రోజులపాటు కష్టపడాల్సి ఉంటుంది.రాయి తెచ్చిన వెంటనే శిల్పం అయిపోదు.

అందుకే అనువైన రాతిని ముందుగా ఎంచుకుంటూ ఉంటారు.అది ఏకశీల గా ఉండాలి.

అలా ఉంటేనే అనుకున్నంత ఎత్తులో శిల్పం తయారు చేయడానికి వీలు అవుతుంది.ఏకశిలా విగ్రహాలను శిల్పులు.

Advertisement

ఓర్పుతో కొన్ని రోజులు శ్రమిస్తే కానీ అవి పూర్తిస్థాయిలో రూపు దిద్దుకోడానికి వీలువు కాదు.ఒకవేళ చిన్న లోపం ఏర్పడిన ఆ విగ్రహాలు పూజలకు అస్సలు పనికిరావు.

చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్దపెద్ద భారీ ఎత్తు ఉండే విగ్రహాల వరకు తిరుపతి లోనే అధిక భాగం విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు.తెలంగాణ సచివాలయంలో నిర్మితం అవుతున్న దేవాలయాలకు సైతం ఇక్కడి నుంచే విగ్రహాలు తయారు చేస్తున్నారు.

తిరుపతిలోని అలిపిరి సమీపంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ సంస్థను టీటీడీ 1978లో స్థాపించింది.ఇక్కడ ఉన్న శిల్పులు దేవతామూర్తుల విగ్రహాలతో పాటు వివిధ రకాల శిల్పాలను అందమైన రూపంతో మార్చడంలో నేర్పరులు.

జీవం లేని రాయికి అందమైన రూపాన్ని అందించి జీవం పోస్తూ ఉంటారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024

మూడు అడుగుల విగ్రహాల నుంచి భారీ ఏకశిలా విగ్రహాలను తయారు చేయడంలో ఇక్కడ ఉన్న పని వారు ఎంతో అనుభవిజ్ఞులు.ఏ శిలా ఎలా ఉండాలో ఒక డిజైన్ టిటిడి శిల్పులకు అందిస్తూ ఉంటుంది.టీటీడీ ఇచ్చిన విధంగా ఆ శిల్పాలను తయారు చేస్తూ ఉంటారు.

Advertisement

ఇలా ఒక్కొక్క శిలకు పది రోజుల నుంచి 25 రోజుల వరకు సమయం పడుతుంది.

ఇంకా చెప్పాలంటే శిల్పం తయారికీ అవసరమయ్యే పరికరాలను శిల్పులు వారే తెచ్చుకుంటారు.మొత్తం 62 మంది శిల్పులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.ఇక్కడ తయారు చేసే విగ్రహాలకు ఏపీ లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మంచి డిమాండ్ ఉంది.

ఒక్కో శిల్పానికి 17వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు నగదును శిల్పులకు టీటీడీ చెల్లిస్తుంది.వారికి ఇచ్చే సంభావం విగ్రహం ఎత్తుబట్టి ఉంటుంది.

తాజా వార్తలు