భగవంతుని ముందు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలియదా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కొబ్బరికాయకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.ఎందుకంటే కొబ్బరికాయను శుభకార్యాలలో ఉపయోగించకుండా ఏ శుభకార్యం పూర్తికాదు.

అంతేకాకుండా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా దేవుని ఎదుట కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తూ ఉంటారు.అంతేకాకుండా ఏదైనా పనులు ప్రారంభించే సమయంలో కూడా మంచి జరగడం కోసం కొబ్బరికాయన కొడుతూ ఉంటారు.

ఇలా ఏదైనా మంచి పనులు మొదలుపెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం శాంతి కారకం, అరిష్ట నాశకం అని పెద్దలు చెబుతూ ఉంటారు.అయితే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ కొబ్బరికాయ కొట్టే సమయంలో కొన్ని నియమాలను పాటించాలని చెబుతూ ఉంటారు.

ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా దేవాలయంలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.

Advertisement

భగవంతుని ముందు కొబ్బరికాయ కొట్టే సమయంలో దానిని మంచినీటితో శుద్ధి చేయడం మంచిది.ఇంకా చెప్పాలంటే టెంకాయ కొట్టే సమయంలో కింద ఉన్న రాయి ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవడం మంచిది.

అంతే కాకుండా కొబ్బరికాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు నుంచి కొట్టడం శుభప్రదం.

కొబ్బరికాయ కొట్టి రెండు ముక్కలు చేసిన తర్వాత వాటిని పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు.ఇలా చేయడం వల్ల పూజ విరుద్ధం అవుతుంది.అయితే కొన్ని సందర్భాలలో కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది.

దీంతో అందరూ దానిని అశుభంగా భావిస్తారు.అటువంటి సమయంలో సర్వం సర్వేశ్వరార్పితం అని భావించి పరమాత్ముని 108 సార్లు జపిస్తే మంచి జరిగే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, బుధవారం 2024

ఇక భక్తులు టెంకాయతో దేవునికి అభిషేకాలు చేస్తుంటారు.అయితే చాలామంది ఆ కొబ్బరికాయను రెండు ముక్కలు చేయకుండా చేత్తో పట్టుకుని అభిషేకం చేస్తూ ఉంటారు.

Advertisement

పొరపాటున కూడా ఇలా చేయడం అంత మంచిది కాదు.రెండు ముక్కలు చేయకుండా చేత్తో పట్టుకుని అలాగే అభిషేకం చేసిన టెంకాయ నైవేద్యానికి పనికిరాదు.

తాజా వార్తలు