అన్నపూర్ణ దేవికి నవరాత్రుల్లో ఏ నైవేద్యాలు పెట్టాలో తెలుసా..?

నవరాత్రుల్లో మూడవ రోజు దుర్గమ్మ దేవి ( Goddess Durgamma )శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తారు.

కాశి విశ్వేశ్వరుడి ప్రియ పత్రిగా శ్రీ అన్నపూర్ణ దేవిగా విరజుల్లుతోంది.

అయితే సకల ప్రాణికోటికి అన్నం ఆధారం.అన్నపూర్ణ దేవిని పూజించడం వలన కిందికి ఎలాంటి లోటు ఉండదు.

ధన ధాన్య అభివృద్ధి, ఐశ్వర్య సిద్ది కూడా కలుగుతాయి.అయితే ఆ రోజున అమ్మవారు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు.

ఆ రోజు అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజిస్తారు.అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం కూడా నైవేద్యంగా పెడతారు.

Advertisement

అయితే ఈరోజు అన్నదానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారు.అయితే శివుడు( Lord Shiva ) ఓసారి పార్వతి దేవితో ప్రపంచమంతా మాయ అన్నం కూడా మాయ అని అన్నారట.

ఆ మాటలు నచ్చని పార్వతీదేవి కాశీని విడిచిపెట్టి వెళ్ళింది.దాంతో అక్కడ దుర్భరమైన కరువు ఏర్పడింది.ప్రజలంతా అన్నం దొరకపోవడం వలన అలమటించి పోయారు.

ప్రజల కష్టాలు చూసి చలించి పోయిన పార్వతీదేవి తిరిగి కాశీకి వచ్చి భక్తులను కరుణించింది.అప్పుడు శివుడు తను అన్నం మాయ అనడం సరికాదని అది ఇప్పుడు తెలుసుకున్నట్లు చెప్పారు.

భర్త సత్యాన్ని గ్రహించినందుకు పార్వతీదేవి( Goddess Parvati ) సంతోషంగా శివుడికి భోజనం పెట్టింది.దీంతో అప్పటినుంచి పార్వతీదేవిని ( Goddess Parvati )అన్నపూర్ణగా కొలుస్తారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024

అందుకే మన పెద్దవాళ్లు కూడా ఎప్పుడూ తినే ఏ పదార్థాలను కూడా వృధా చేయకూడదు అని చెబుతూ ఉంటారు.

Advertisement

ఎందుకంటే స్వయానా పార్వతీదేవి అన్నపూర్ణ దేవిగా కొలుస్తారు.కాబట్టి తినే ఎలాంటి పదార్థమైన, ఏ పదార్థమైనా కూడా అస్సలు వృధా చేయకూడదు.అలాంటప్పుడే అన్నపూర్ణాదేవి ( Sri Annapurna Devi )మనకు నిత్యం ధనరాశులని కురిపిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా మన ఇంట్లో ధన సంపదలకు ఎలాంటి లోటు ఉండదు.అయితే చాలామంది వృధాగా భోజనం పారెస్తూ ఉంటారు.అలాంటి వాళ్లలో అన్నం దొరక్క చాలా కష్టాలు పడుతూ ఉంటారు.

అందుకే ఎప్పటికైనా అన్నాన్ని గౌరవించాలి.అప్పుడే మనకు ధాన్యరాశులు లభిస్తాయి.

తాజా వార్తలు