Mahesh Babu: మహేష్ బాబు హీరో కాకుంటే ఏ పని చేసేవారో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సినిమాల్లోకి తండ్రి కృష్ణ నటవారసత్వాన్ని పునికి పుచ్చుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం ( Guntur kaaram ) సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈయన ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ కూడా వచ్చింది.అయితే మహేష్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరో కాకపోతే ఏ పని చేసేవారు అని ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం ఉంది.

అయితే ప్రతి ఒక్క హీరో సినిమాల్లోకి రాకపోతే ఏదో ఒక వృత్తిలో కొనసాగాలి అని చిన్నప్పుడే నిర్ణయించుకుంటారు.అలా మహేష్ బాబు కూడా చిన్నప్పుడే డాక్టర్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారట.

దానికి సంబంధించిన చదువు కూడా చదివి మంచి డాక్టర్ అయ్యి పేదలకు ఉచిత వైద్యం చేయాలి అని ఎన్నో కలలు కన్నారట.కానీ అనూహ్యంగా ఆయన నిర్ణయం సినిమాల వైపు మళ్ళింది.

Advertisement

తన తండ్రి కృష్ణ ( Krishna ) మేకప్ వేసుకొని సినిమా షూటింగ్ లకి వెళ్తూ ఉంటే తండ్రిని చూసి ఆయనకు కూడా మేకప్ వేసుకోవాలి అనే ఆశ పెరిగిందట.అంతేకాదు అప్పుడప్పుడు తండ్రి నటించే సినిమా షూటింగ్లకు ఈయన కూడా వెళ్లేవారు.

అలా సినిమా షూటింగ్లో జరిగేటప్పుడు చూసి మహేష్ బాబు ఆకర్షితుడై ఎలాగైనా సినిమాల్లో స్టార్ హీరో అవ్వాలి అనుకున్నారట.ఇక మహేష్ బాబు ఏజ్ పెరుగుతున్నా కొద్ది కృష్ణ మహేష్ బాబుకు కూడా ఇంటి దగ్గరే మేకప్ వేసి షూటింగ్ తీసుకువెళ్లి ఏదైనా చిన్న చిన్న పాత్రలకు సెట్ అవుతాడా లేదా అని స్క్రీన్ టెస్ట్ చేసి చూసుకునేవారట.అయితే కృష్ణ కి కూడా తన కొడుకుని స్టార్ హీరో చేయాలని ఉండేది.

కానీ పెద్దయ్యాక చూసుకుందాంలే అని అనుకునేవారట.అయితే కొద్ది రోజులకు మహేష్ బాబు ( Mahesh Babu ) తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.

అలా మహేష్ బాబుకి సినిమాలపై మరింత మక్కువ పెరిగిందట.దీంతో డాక్టర్ అవ్వాలనే కల పక్కన పెట్టి చదువు పూర్తయ్యాక రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు ( Raja Kumarudu ) అనే సినిమాతో మొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమా ఓ మోస్తరు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన మురారి, దూకుడు,ఒక్కడు, పోకిరి,అతడు వంటి సినిమాలు మహేష్ బాబుని స్టార్ హీరోగా మార్చాయి.

350 మంది అభిమానులకు లంచ్ ఏర్పాటు చేసిన సాయితేజ్.. ఈ మెగా హీరో గ్రేట్!
Advertisement

తాజా వార్తలు