ఆషాడ మాస విశిష్టత ఏమిటో తెలుసా..? ఆరోజు చేయకూడని పనులు ఇవే..!

జూన్ 19న ఆషాడమాసం ( Asadha )ప్రారంభమవుతుంది.జులై 15 వరకు ఈ మాసం ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో రెండు ఆయనములు.ఉత్తరాయనము, దక్షిణాయనము.

సూర్యుడు ధనూరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఉత్తరాయనం అని అంటారు.మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం దక్షిణాయనం.

ఇలాంటి ఆయనములు ప్రారంభమైనటువంటి మాసములనే పుష్య మాసము అని అంటారు.దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మాసమే ఆషాడమాసం అని అంటారు.

Advertisement

అయితే ఈ రెండు మాసంలో కూడా శూన్య మాసములు అని శాస్త్రాలు సూచించాయి.ఇక శూన్యమాసముల యందు గృహారంభం, వివాహాది శుభకార్యామలు ఆచరించకూడదని శాస్త్రములు చెబుతున్నాయి.

ఇక శూన్యమాసం దేవతారాధనలకు మాత్రమే.శక్తి ఆరాధనలకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.ఈ ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది.

ఆషాడమాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవలకు శుభప్రదంగా పరిగణించబడింది.అందుకే ఈ ఆషాడ మాసంలో ఆలయాలు భక్తులతో నిండి ఉంటాయి.

అలాగే ఆషాడమాసంలో ఆలయాలలో పూజలు, పండుగలతో మునిగిపోతారు.అలాగే పూజా కార్యక్రమాల్లో పండితులు కూడా నిమగ్నమై ఉంటారు .కథల ప్రకారం ఆషాడంలో శ్రీ మహావిష్ణువు( Maha vishnu ) నిద్రలోకి వెళ్తాడు.

పరగడుపున ఈ పండును తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు..!

దీనివలన వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.ఆషాడమాసం వస్తే చాలు కొత్తగా వచ్చిన కోడలు అత్తారింట్లో ఉండకూడదు.అందుకే వారిని పుట్టింటికి పంపించేయాలి.

Advertisement

అలాగే ఆషాడమాసంలో భార్యాభర్తలు కలిస్తే వెంటనే గర్భం దాల్చే అవకాశం ఉంది.ఇక ఆ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది.

దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు రోగాలు వస్తాయని భావించి మన పూర్వీకులు భార్య భర్తల( Couple )ను ఈ నెలలో దూరంగా పెట్టాలని సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు.వేసవిలో సాధారణ ప్రసవం వలన ఇబ్బందులు ఉంటాయి.

కాబట్టి ఈ మాసం లో ఇవన్నీ పాటించాలి.

తాజా వార్తలు