Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?

ఇండస్ట్రీలో ఉండే రెండో తరం హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ).

అక్కినేని ఇంటి వారసత్వాన్ని ఇండస్ట్రీలో కొనసాగిస్తూ స్టార్ హీరోగా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.

ఓవైపు బిగ్ బాస్ ( Biggboss )రియాల్టీ షో పేరుతో హోస్టుగా బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా తనదైన శైలిలో 60 ఏళ్లు దాటినా కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు.ఇక నాగార్జున కేవలం సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా టాప్ పొజిషన్ లో ఉన్నారు.

ఇక అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఆయనకి కేవలం కొడుకుల విషయంలోనే ఓ దిగులు పట్టుకుంది.అందుకే 60 ఏళ్ల వయసులో కూడా ఎంతో యంగ్ గా కనిపించే నాగార్జున ఈ మధ్యకాలంలో కాస్త లుక్ చేంజ్ అయిపోయింది.దానికి కారణం తన కొడుకుల సినీ కెరియర్ అంతంత మాత్రంగానే ఉండడంతో నాగార్జునకి కాస్త దిగులు పట్టుకుంది అని టాలీవుడ్ మీడియాలో ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి.

ఇక ఇదంతా పక్కన పెడితే నాగార్జున ప్రస్తుతం నా సామి రంగా ( Naa saami ranga ) అనే సినిమా లో నటిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో కుర హీరోలైనా రాజ్ తరుణ్ అలాగే కామెడీ హీరో అయిన అల్లరి నరేష్( Allari Naresh ) కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.అలాగే హీరోయిన్ గా ఆశికా రంగనాథన్ ( Ashika ranganathan ) చేస్తుంది.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా నాగార్జున ఓ మీడియా ఛానల్ ప్రమోషన్ లో భాగంగా తనకి ఇష్టమైన ఆహారం ఏంటి అనే విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.నాగార్జున ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

నాకు హాట్ రైస్ అలాగే హాట్ చారు,హాట్ చిప్స్ అలాగే నెయ్యి ఇవన్నీ అంటే చాలా ఇష్టం.వీటన్నింటిని నేను ఎంతో ఇష్టంగా తింటాను అంటూ నాగార్జున ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ప్రస్తుతం నాగార్జున కి ఇష్టమైన ఫుడ్ గురించి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు