God Image Ring : దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాన్ని ధరిస్తే ఏమవుతుందో తెలుసా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు చేతికి బంగారు లేదా వెండి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు.

ఎక్కువ శాతం మంది ప్రజలు వారికి వారి స్థాయికి తగ్గట్టుగా ఉంగరాలని ధరిస్తూ ఉంటారు.

అయితే ఈ బంగారు ఉంగరాలలో కొందరు వారికి ఇష్టమైన దేవుడు బొమ్మలతో తయారు చేసుకుని అటువంటి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు.మరి కొంతమంది వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు రాళ్ళను ఉంగరాలలో ఉంచి తయారు చేయించి ధరిస్తూ ఉంటారు.

చాలామందిలో ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.అదేమిటంటే దేవుడి ప్రతిమ కలిగినా ఉంగరాలను చేతివేళ్ళకు ధరించవచ్చా, అలా ధరిస్తే ఏమైనా చెడు జరుగుతుందా అన్న సంకేత సందేహాలు కూడా ఉన్నాయి.

ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయితే చాలామంది వేద పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప, ఎర్రరాయి ఇలా రకరకాల రంగురాళ్లు కలిగిన ఉంగరాలను వాళ్లు ధరించండి అని చెబుతూ ఉంటారు.

Advertisement
Do You Know What Happens If You Wear A Ring With The Image Of God , Image Of God

మరికొందరు ఆ రాయి ఈ రాయి ఉంగరాలు ఎందుకు ఏకంగా దేవుడి బొమ్మ కలిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల ఎలాంటి బాధలు ఉండవు కదా అని దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు.అలా దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాన్ని చేతికి ధరించడం వల్ల ఆ దేవుడి దయ ఎప్పుడు వారిపై ఉంటుందని ఇలా ఉంగరాలు ధరించేవారు నమ్ముతారు.

Do You Know What Happens If You Wear A Ring With The Image Of God , Image Of God

అయితే దేవుని ప్రతిమ కలిగిన ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు మనం తినే ఎంగిలి మెతుకులు దేవునికి తగలడం ఎంతవరకు కరెక్ట్ అన్నది చాలామంది ఆలోచన చేయరు.దేవుడికి నైవేద్యం చేసినప్పుడు మనం దానిని ఎంగిలి చేసి పెడతామా లేదా అనే విషయం మనం కచ్చితంగా ఆలోచన చేయాలి.అయితే దేవుడి ఉంగరాన్ని ధరించడం మంచిదే కానీ అన్నం తినడానికి ముందు ఆ దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాన్ని తీసివేసి తిని ఆ తర్వాత దానిని ధరించడం మంచిది.

Advertisement

తాజా వార్తలు