వేస‌వి కాలంలో చిలకడదుంప తింటే ఏం అవుతుందో తెలుసా?

పెద్ద‌లే కాదు పిల్ల‌లు కూడా ఇష్టంగా తినే దుంపుల్లో చిల‌క‌డ‌దుంప( Potato ) ఒక‌టి.కొన్ని సంద‌ర్భాల్లో చిల‌క‌డ‌దుంప మంచి చిరుతిండిగా మారుతుంటుంది.

చాలా మంది చిల‌క‌డ‌దుంప‌ను ఉడికించి లేదా కాల్చి తింటుంటారు.అయితే ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఆరోగ్యానికి మేలు చేసే సూప‌ర్ ఫుడ్స్ లో చిల‌క‌డ‌దుంప కూడా ఒక‌టి.

అవును, వేసవి కాలంలో చిలకడదుంప తినడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.చిలకడదుంపలో పోటాషియం( Potassium ) ఎక్కువ‌గా ఉంటుంది, అందువ‌ల్ల ఇది బాడీలో నీటిశాతాన్ని సమతుల్యం చేస్తుంది.

వేసవి వేడి వల్ల జరిగే డీహైడ్రేషన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.అలాగే వేస‌వి కాలంలో ఎండ‌ల కార‌ణంగా త‌ర‌చూ నీర‌సం లేదా అల‌స‌ట‌కు గుర‌వుతుంటారు.

Advertisement

అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో చిల‌క‌డ‌దుంప స‌మాయ‌ప‌డుతుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఒక ఉడికించిన చిలకడదుంపను తీసుకోండి.

చిలకడదుంపలో కార్బోహైడ్రేట్లు మంచి మొత్తంలో ఉంటాయి.ఇవి నెమ్మదిగా జీర్ణమై శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి.నీర‌సం, అల‌స‌ట బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తాయి.

ఉడికించిన చిల‌క‌డ‌దుంప‌ను డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ శరీరంలోని అధిక వేడి త‌గ్గుతుంది.వేసవిలో ఎండ వల్ల స్కిన్ అనేది చాలా పాడ‌వుతుంది.అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి.

అయితే చిల‌క‌డ‌దుంప‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి( Vitamin A, Vitamin C ) మెండుగా ఉంటాయి.ఇవి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఎండ వల్ల కలిగే నష్టం నుంచి చ‌ర్మాన్ని రక్షిస్తాయి.

Advertisement

వేస‌వి కాలంలో చిల‌క‌డ‌దుంపను డైట్ లో భాగం చేసుకోవ‌డంతో.అందులో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణ సంబంధ సమస్యలను అడ్డుకుంటుంది.మ‌ల‌బద్ధ‌కం స‌మ‌స్య‌ను నివారిస్తుంది.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బీపీ మారిపోతుంటుంది, అయితే చిల‌క‌డ‌దుంపులో పొటాషియం ఉండ‌టం వ‌ల్ల ఇది రక్తపోటు నియంత్రణలో హెల్ప్ చేస్తుంది.కాబ‌ట్టి, ఈ హాట్ హాట్ స‌మ్మ‌ర్ లో చిల‌క‌డ‌దుంప‌ను డైట్ లో చేర్చుకోండి.

అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం వెయిట్ గెయిన్‌, క‌డుపు ఉబ్బరం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్ర‌త్త‌.

తాజా వార్తలు