Temples : దేవాలయాల నీడ ఇంటి పై పడితే ఏమవుతుందో తెలుసా..?

ఆలయం( Temples ) అంటేనే పవిత్రమైన స్థలం అని అందరికీ తెలుసు.భగవంతుని సన్నిధిలో అడుగుపెట్టగానే భక్తులు తన్మయత్వానికి లోనవుతారు.

ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన దేవాలయంలో ఒక శక్తి కేంద్రీకృతమై ఉంటుంది.క్రమం తప్పకుండా పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుండడంతో అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది.

అందుకే దేవాలయంలో అడుగుపెట్టగానే పవిత్రంగా ఉండాలని సూచిస్తారు.మరి మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ సమీపంలో ఉన్న వారందరికీ మంచి జరగాలి కదా.మరి దేవాలయంలో సమీపంలో ఇల్లు ఉండకూడదు అని ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know What Happens If The Shadow Of Temples Falls On The House

ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయం నీడ పడే ఇంట్లో సుఖ సంతోషాలు, మన శ్శాంతి ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయం పై వివాదాలు జరుగుతూనే ఉంటాయి.అందుకే దేవాలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి.

Advertisement
Do You Know What Happens If The Shadow Of Temples Falls On The House-Temples :

ఇంటికి దేవాలయానికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూలవిరాట్ విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి.వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు ఇల్లు వెనుక వైపు, శ్రీమహా విష్ణువు( Lord Vishnu ) దేవాలయానికి ముందు వైపు ఇల్లు ఉండవచ్చు.

శివాలయా( Shivalayam )నికి దగ్గరలో ఉంటే శత్రుభయం, విష్ణు దేవాలయానికి దగ్గరలో ఉంటే డబ్బు నిలువదని చెబుతారు.అమ్మవారి దేవాలయనికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు అభివృద్ధి చెందరు.

Do You Know What Happens If The Shadow Of Temples Falls On The House

అలాగే విఘ్నాలు తొలగించే వినాయకుని దేవాలయం ఇంటికి ఉత్తరం, వాయువ్యం వైపు ఉంటే ఆ ఇంట్లో ఉండే వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి.వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి.ఇంటి పై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదు.

దేవుడి ధ్వజం శక్తి సంపన్నం, ఉగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది.అందుకే పూర్వ కాలంలో దేవాలయాలు పర్వతాలు,నది తీరలలో మాత్రమే నిర్మించేవారు.

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌నుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ మీకే!

సమీపంలో ఉన్న వారంతా భయపడవలసిన అవసరం లేదు.మీ ఇల్లు డైరెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి.

Advertisement

ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఎలా ఉన్నారో గమనించాలి.అవసరమైతే నిపుణులైన వాస్తు నిపుణుల సలహా తీసుకోవాలి.

తాజా వార్తలు