లక్ష్మీదేవిని గన్నేరు పువ్వులతో ఇలా పూజిస్తే ఏమవుతుందో తెలుసా..?

గన్నేరు పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.కొన్ని పురాణాల ప్రకారం గన్నేరు పూల ప్రస్తావన చాలా ఉంది.

కావున గన్నేరు పూలను లక్ష్మీదేవికి సమర్పించడం వలన ఆ వ్యక్తికి మానసిక ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి,అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి అని చెబుతుంటారు.అందుకే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) దీవెనలు పొందాలనుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గన్నేరు మొక్కలు పెంచడం చాలా మంచిది.

అయితే గన్నేరు పూలు, ఎరుపు, గులాబీ అలాగే తెలుపు రంగులో లభిస్తాయి.గన్నేరు పువ్వులు( Gunner flowers ) కొన్ని రకాల సమస్యలను తీర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది ఎంత పని చేసినప్పటికీ కూడా సంపద వృద్ధి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇక వారింట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు ఏర్పడుతుంటాయి.

Advertisement

దానివల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతూ ఉంటుంది.అలాంటివారు ఎర్రటి గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వలన వారి సంపద క్రమంగా వృద్ధి చెందుతుంది.

చాలామంది ఇళ్లలో భార్యాభర్తలు ( husband , wife )ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటారు.అలాంటి వారు ఇంట్లో శాంతి, భావన, నిరాశ నిస్సృహాలు ఎక్కువగా కనబడుతుంటాయి.ఇలాంటి భార్యాభర్తలు కలిసి తెల్లగన్నేరు పూలతో లక్ష్మీదేవికి 21 రోజులపాటు పూజించాలి.

ఇలా చేయడం వలన వారిద్దరి మధ్య సమస్యలు తొలగిపోతాయి.ఇక చాలామంది ఎంత కష్టపడినప్పటికి కూడా వ్యాపారం వృద్ధి కాకా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అలాంటివారు వ్యాపారం ఉండే స్థానంలో లక్ష్మీ గణపతి ఉన్న ఫోటోలు తీసుకోనీ రోజు గన్నేరు పూలతో పూజించి లక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోయి వ్యాపారం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుంది.అంతేకాకుండా చాలామంది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

అలాంటి వారు ఎర్రటి గన్నేరు పువ్వుల మాలను ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వలన ఎలాంటి దోషాలైనా తొలగి ఉద్యోగం ప్రయత్నాలు ఫలిస్తాయి.ఎన్నో ఏళ్ల తర్వాత కూడా చాలామందికి పిల్లలు కలగక సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

Advertisement

అలాంటి వారు గన్నేరు పూల మొక్క చుట్టూ 11 ప్రదక్షిణాలు 41 రోజులపాటు చేస్తే క్రమంగా సంతానలేమి సమస్యలు దూరం అవుతాయి.

తాజా వార్తలు