మంత్రాలయంలో ఉండే రాఘవేంద్ర స్వామి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

తమిళనాడుకు చెందిన తిమ్మనభట్టు, భువనగిరి వాసులైన గోపికాంబలు భార్యాభర్తలు.వీదిద్దరికీ పుట్టిన సంతానమే వెంకటనాథుడు.

అయితే వెంకట నాథుడే రాఘవేంద్ర స్వామి. కానీ ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట నాథుడు.

ఈయన 1595లో జన్మించారు.ఐదేళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.

ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు.యుక్త వయసు వచ్చే సరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకట నాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరించాడు.

Advertisement

అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు.ఆథ్యాత్మిక భోదనలు చేస్తూ.తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు.

ఆ తర్వాత కర్మాటక సరిహద్దులోని పంచముఖి వద్ద 12 ఏళ్లు తపస్సు చేశారు.ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షం అయ్యారని చరిత్ర చెబుతోంది.

ఆ తర్వాతే ఆయన పవిత్ర తుంగభద్ర నదీ తీరాన ఉన్న మంత్రాలయానికి వచ్చి అక్కడే బోధనలు కొనసాగించాడు.ఆదోని నవాబు సిద్ధిమసూద్ ఖాన్ నుంచి మంచాలా గ్రామాన్ని దానంగా పొందారు.

మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి ఆ రాయితోనే తనకు బృందావనం నిర్మించాలని దివాన్ వెంకన్న చారిని ఆజ్ఞాపించారట.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రోజు నైట్ త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఇకపై ఇలా చేయండి!

అయితే ఆ కొండశిల సీతారాములకు ఏడ గంటల పాటు విశ్రాంతిని ఇచ్చిందని.ఆ మేరక 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి స్వామి వారు వరం ఇచ్చారట.అందుకే రాఘవేంద్ర స్వామి బృందావనం నిర్మాణంలో ఆ రాతిని వాడారట.

Advertisement

ఆ నిర్మాణం తర్వాత అంటే 1671లో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి అయ్యారు.

తాజా వార్తలు