కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ కాంబో లో మిస్ అయిన ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ.

ఒకప్పుడు కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేశాయి.

అలాంటి కృష్ణ వంశీ( Krishna Vamsi) ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏవి అంచనాలను అందుకోవడం లేదు.మరి దానికి కారణం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే రోజు మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకి రిలీజ్ అప్పుడు ఎలాంటి ఆదరణ అయితే దక్కిందో ఇప్పుడు కూడా అలాంటి ఆదరణ దక్కుతుండటం విశేషం.ఇక రీ రిలీజ్ లో భారీ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల్లో మురారి నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా డిలే అయినట్టుగా తెలుస్తుంది.

Do You Know The Super Hit Movie That Is Missing In Krishnavamsi Pawan Kalyan Com
Advertisement
Do You Know The Super Hit Movie That Is Missing In Krishnavamsi Pawan Kalyan Com

నిజానికి ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కృష్ణవంశీ తో ఒక సినిమా చేయాల్సింది.కానీ అప్పుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కొంచెం బిజీగా ఉండడం, ఆ తర్వాత కృష్ణవంశీ బిజీగా మారడం వల్ల వీళ్ళ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.అందువల్ల వీళ్ళ కాంబో లో ఒక మంచి సినిమా అయితే మిస్ అయిందనే చెప్పాలి.

Do You Know The Super Hit Movie That Is Missing In Krishnavamsi Pawan Kalyan Com

మరి ఇక మీదట వీళ్ల కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఇక మీదట లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా చాలా బిజీగా ఉన్నాడు.కాబట్టి ఆయనతో సినిమాలు చేసే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ బిజీగా లేకపోతే కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చితే ఆయన సినిమా చేసే అవకాశాలైతే ఉంటాయి.చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ ఫ్యూచర్ లో సెట్ అవుతుందా లేదా అనేది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు