వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే వైశాఖ మాసం( Vaishakha Month ) ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలైంది.

అయితే ఈ మాసంలో ఉపవాసాలు పండగల విషయంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

ఈ మాసంలో ప్రధానోపావాసాలు పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ నూతన సంవత్సరంలో వైశాఖం రెండవ నెలలో వస్తుంది.

ఈ మాసంలో విష్ణుమూర్తిని( Vishnumurthy ) పూజిస్తారు బుద్ధుడు, పరశురాముడు కూడా ఈ మాసంలోనే జన్మించారని పండితులు చెబుతున్నారు.ఈ మాసంలో పుణ్యం సంపదను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి.

అంతేకాకుండా సీత జయంతి కూడా ఈ మాసంలోనే వస్తుంది.మతపరమైన ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు.

Do You Know The Significance Of Vaishakha Month Details, Vaishakha Month, Vaish
Advertisement
Do You Know The Significance Of Vaishakha Month Details, Vaishakha Month, Vaish

శ్రీకృష్ణుని( Sri Krishna ) మాధవ రూపాన్ని వైశాఖ మాసంలో పూజిస్తారు.వైశాఖ మాసం స్నానానికి, దానధర్మాలకు, శుభకార్యాలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో చాలా ముఖ్యమైన పండుగలు, ఉపవాసాలు జరుగుతాయి ఈ ప్రధాన పండుగలలో కొన్ని అక్షయ, తృతీయ, వరుదని, ఏకాదశి, సీతానవమి, భగవంతుడు నృసింహ జయంతి మొదలైనవి ఉంటాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖమాసం, కృష్ణపక్షం ప్రతిపాద తేదీ ఏప్రిల్ 24 ఉదయం 5:18 నిమిషములకు మొదలవుతుంది.ఈ తేదీ ఏప్రిల్ 25 ఉదయం 6 గంటల 46 నిమిషములకు ముగుస్తుంది.

వైశాఖ మాసం కృష్ణపక్ష ప్రతిపాద తిధి ఏప్రిల్ 24వ తేదీన బుధవారం సూర్యోదయం నుంచి మొదలవుతుంది.

Do You Know The Significance Of Vaishakha Month Details, Vaishakha Month, Vaish

ఈరోజు నుంచే వైశాఖ మాసం ప్రారంభమై మే 23వ తేదీ న ముగిసిపోతుందని పండితులు చెబుతున్నారు.అలాగే ఇప్పుడు వైశాఖమాసం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుని( Sri Maha Vishnu ) పూజించడం వల్ల అనేక రెట్లు పుణ్య ఫలితాలు లభిస్తాయి.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

మత విశ్వాసాల ప్రకారం వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించారు.పరశురాముడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని శత్రువులను కూడా జయించవచ్చు అని ప్రజలు నమ్ముతారు.

Advertisement

అంతేకాకుండా వైశాఖమాసంలో గంగ స్నానం, దానధర్మాలు కూడా ముఖ్యమైనవి.వైశాఖలో గంగా స్నానం చేయడం వల్ల మనిషి సర్వపాపల నుంచి విముక్తి పొందుతాడు.

తాజా వార్తలు