లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండటానికి కారణం ఏమిటో తెలుసా!

ఎంతో మంది భక్తులు వారి కోరికలు నెరవేరడం కోసం సాక్షాత్తు ఆ లక్ష్మి నారాయణుడిని పూజించడం మనం చూస్తుంటాము.

అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలం లో కొలువై ఉందనే విషయం చాలామందికి తెలియదు.

అమ్మవారు ఆ విధంగా స్వామివారి వక్షస్థలంలో ఉండటానికి కారణం ఏమిటి? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఒకసారి వైకుంఠంలో శ్రీవారికి సేవ చేస్తున్న లక్ష్మీదేవిని శ్రీహరి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా అందుకు లక్ష్మీదేవి ఏ భార్య అయినా తన భర్త అనురాగం తనకు ఉండాలని కోరుకుంటుంది.

నాకు మీ అనురాగం పుష్కలంగా ఉంది.ఇంతకన్నా అదృష్టం మరేం కావాలి అని లక్ష్మీదేవి అనగా అందుకు శ్రీహరి,పరమేశ్వరుడి అనుగ్రహం కూడా ఉండాలని ఆ శివుని ప్రసన్నం చేసుకోమని చెబుతాడు.

అప్పుడు పార్వతీదేవి భూలోకంలో ఒక అనువైన స్థలంలో పరమేశ్వరుడి కోసం ఘోరతపస్సు చేస్తుంది.అయితే ఈ తపస్సును ప్రారంభించడానికి ముందుగా లక్ష్మీదేవి వినాయకుడు పూజ చేయడం మర్చిపోతుంది.

Advertisement
Reason Behind Why Lakshmi Devi Is In The Heart Of Vishnumoorty, Lakshmidevi, Vis

వినాయకుడికి పూజ చేయకుండా తపస్సును ప్రారంభించిన లక్ష్మీదేవికి శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోతోంది.

Reason Behind Why Lakshmi Devi Is In The Heart Of Vishnumoorty, Lakshmidevi, Vis

ఈ క్రమంలోనే ఆమె దూరదృష్టితో అసలు విషయం తెలుసుకొని వినాయకుడి పూజ చేసి పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తుంది.ఎంత తపస్సు చేసిన పరమేశ్వరుడు రాకపోగా ఆమె దేహం నుంచి అగ్ని బయటకు వస్తూ సమస్తాలను దహించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఋషులు పరమేశ్వరుడిని వేడుకోగా పరమేశ్వరుడు నందిని భూమిపైకి పంపిస్తాడు తన మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని బ్రాహ్మణ వేషంలో ఉన్న నందీశ్వరుడు లక్ష్మీదేవికి తెలియజేస్తాడు.

Reason Behind Why Lakshmi Devi Is In The Heart Of Vishnumoorty, Lakshmidevi, Vis

ఈ క్రమంలోనే హోమాన్ని ప్రారంభించిన లక్ష్మీదేవి హోమం నుంచి ఒక భయంకర రూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అంటూ అర్థ నాదాలు చేస్తుంది.ఆ సమయంలో లక్ష్మీదేవి వామభాగపుస్తనాన్ని ఖండించి సమర్పించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన భక్తికి మెచ్చి ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసే ఏం వరం కావాలో కోరుకోమని చెబుతాడు.అప్పుడు ఆమె అన్ని వేళలా తనకు శివానుగ్రహం ఉండాలని కోరుకుంటుంది.

అందుకు పరమేశ్వరుడు “తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు.అని వరం ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో కొలువై ఉంది.

అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు