అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటో తెలుసా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

కానీ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లని రీ షూట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా డిసెంబర్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.ఇప్పటికే సుకుమార్, అల్లు అర్జున్( Sukumar and Allu Arjun ) మధ్య కొంతవరకు విబేధాలు అయితే వచ్చాయట.ఇక ఈ సినిమా పోస్ట్ పోన్ చేయడం గురించే ఇలాంటి విభేదాలు వచ్చి ఉంటాయని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

ఇక పుష్ప సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకుంది.ఇక దాని మాదిరిగానే పుష్ప 2 సినిమా కూడా అలాంటి ఒక భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందని అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు చాలా వరకు ప్రయత్నం చేసి వాళ్ళ పూర్తి ఎఫర్ట్ ను పెట్టి ఈ సినిమాని చేస్తున్నారు.

Advertisement

అయినప్పటికీ ఈ సినిమా విషయంలో అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ 100 % సాటిస్ఫాక్షన్ తో అయితే లేనట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా డిసెంబర్ 6 నుంచి మరోసారి పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత తగ్గిపోతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఈ విషయం మీద పుష్ప 2 టీమ్ నుంచి ఏదైనా అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందా లేదనేది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు