వెంకటేష్ తో ఎన్ శంకర్ చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా..?

అప్పట్లో విక్టరీ వెంకటేష్ వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేసేవాడు.

అలా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేష్ అనే చెప్పాలి.

అలాంటి వెంకటేష్ ఒకానొక టైం లో వరుసగా రీమేక్ సినిమాలు చేసి వరుస హిట్లు కొట్టి ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ అనే బిరుదుని కూడా సంపాదించుకున్నాడు.అయితే వెంకటేష్ చేసిన రాజా సినిమా ఉన్నిటత్తిల్ ఎన్నై కోడెతేం అనే తమిళ్ సినిమా కి రీమేక్ గా వచ్చింది.

దీనికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా సౌందర్య నటించింది అబ్బాస్ ఒక చిన్న పాత్రలో నటించాడు.

అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయి ఒక సంవత్సరం పాటు నడిచింది.

Do You Know The Movie With Venkatesh And N Shankar , N Shankar, Venkatesh, Sund
Advertisement
Do You Know The Movie With Venkatesh And N Shankar , N Shankar, Venkatesh, Sund

ఇక ఈ విషయం ఇలా ఉంటె ఈ సినిమాకి ముప్పలనేని శివ కంటే ముందే ఎన్ శంకర్ ని డైరెక్టర్ గా తీసుకుందాం అని సురేష్ బాబు చూశారట కానీ అప్పటికే ముప్పలనేని శివ వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమా చేద్దాం అని రామానాయుడు గారు ఫిక్స్ అయ్యారట దాంతో ఎన్ శంకర్ తో రీమేక్ సినిమా కాకుండా డైరెక్ట్ సినిమా చేద్దాం అని సురేష్ బాబు చెప్పారట దానికి ఎన్ శంకర్ కూడా ఒకే అన్నాడట అలా వెంకటేష్ ఎన్ శంకర్ కాంబినేషన్ లో రావాల్సిన రాజా సినిమా వెంకటేష్, ముప్పలనేని శివ కాంబినేషన్ లో వచ్చింది.

Do You Know The Movie With Venkatesh And N Shankar , N Shankar, Venkatesh, Sund

ఆ తర్వాత వెంకటేష్ ఎన్ శంకర్ కాంబినేషన్ లో జయం మనదేరా అనే సినిమా వచ్చింది.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.దాంతో వీళ్లది హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకుంది.

ఎన్ శంకర్ తో ఇంకో సినిమా కూడా ప్లాన్ చేసారు కానీ అది సెట్ అవ్వలేదు మొత్తానికి రాజా సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ అయిన జయం మనదేరా సినిమాతో ఆ కాంబినేషన్ సెట్ అయింది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు