Geetha Arts : గీతా ఆర్ట్స్ లో గీతా పేరు వెనక ఇంత స్టోరీ ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో నిర్మాణ సంస్థలు ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి వాటిలో గీతా ఆర్ట్స్( Geetha Arts ) బ్యానర్ కూడా ఒకటి.

ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.ఇక ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు అన్నీ కూడా ఆయన కుమారుడు అల్లు అరవింద్( Allu Aravind ) చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో ఆల్లు అరవింద్ గొప్ప నిర్మాతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇకపోతే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత ( Geetha ) అంటే ఎవరు అనే సందేహాలు అందరికీ ఉంటాయి చాలామంది అల్లు అరవింద్ గారి గర్ల్ ఫ్రెండ్ పేరు అంటూ కూడా కొందరు ఊహించుకున్నారు.అయితే ఈ విషయం గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ గీత ఆర్ట్స్ అని పెట్టడం వెనుక ఉన్న స్టోరీని తెలిపారు.

Do You Know The Meaning Of Geetha In Allu Aravind Geetha Arts
Advertisement
Do You Know The Meaning Of Geetha In Allu Aravind Geetha Arts-Geetha Arts : గ

నిర్మాణ సంస్థను ప్రారంభించాలి అనుకున్న సమయంలో నాన్నగారు గీత అనే పేరును సెలెక్ట్ చేశారు.ఈ పేరు పెట్టడానికి కారణం కూడా లేకపోలేదని అల్లు అరవింద్ తెలిపారు.ఈ పేరు పెట్టడానికి కారణం భగవద్గీతలో( Bhagavadgeetha ) మనకు ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పబడ్డాయి.

ప్రయత్నం మాత్రమే మనది.ఫలితం మన చేతుల్లో లేదు అని ఒక గొప్ప సందేశం ఇవ్వబడింది.

అది అక్షరాల సినిమా ఇండస్ట్రీకి కూడా సూట్ అవుతుందని భావించి నాన్నగారు ఈ పేరును సూచించారు.

Do You Know The Meaning Of Geetha In Allu Aravind Geetha Arts

ఒక నిర్మాణ సంస్థలో సినిమా చేయటం వరకు మాత్రమే మన పని ఒక మంచి సినిమాను ఇవ్వాలనే ప్రయత్నం నిర్మాణ సంస్థ చేస్తుంది.ఇక ఫలితం ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళలో మాత్రమే ఉంటుందని అందుకే ఈ పేరు అయితే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతోనే నాన్నగారు గీత ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించారని తెలిపారు.అయితే చాలామంది నాకు గర్ల్ ఫ్రెండ్ వున్న మాట వాస్తవమే ఆమె పేరు కూడా గీతనే అందరూ కూడా తన పేరుని నేను పెట్టానని చెబుతుంటారు కానీ అసలు విషయం ఇది అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలిపారు.

Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built

ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ఫ్యామిలీలో కూడా ఎంతో మంది హీరోలు సినిమాలు చూశారు.ఈ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయగా అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి వారు కూడా సూపర్ హిట్ సినిమాలను చేశారు.ఇక తన ఫ్యామిలీ మెంబర్స్ తన బ్యానర్ లో సినిమాలు చేసిన రిలీజ్ కి ఒకరోజు ముందే వారికి ఫుల్ పేమెంట్ సెటిల్మెంట్ చేస్తానని అల్లు అరవింద్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు