ఆ పాటకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేసిందా.... ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉందా?

సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందడం అంటే మామూలు విషయం కాదు.

అయితే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి( Sai Pallavi ) మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు.

నిజానికి ఈమె వైద్య విద్యను చదివిన సంగతి తెలిసిందే ఇలా డాక్టర్ చదివిన ఈమె నటనపై ఆసక్తితో యాక్టర్ గా అడుగుపెట్టారు.

ఇలా నటన విషయంలోనూ అలాగే డాన్స్ ( Dance ) విషయంలోనూ సాయి పల్లవికి ఎవరు సాటిరారని చెప్పాలి అంత అద్భుతంగా డాన్స్ చేస్తూ హీరోలకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు.సాయి పల్లవి పక్కన డాన్స్ చేయడం అంటే హీరోలకు కష్టమైన పని అని చెప్పాలి.అయితే ఈమె డాక్టర్ అలాగే యాక్టర్ మాత్రమే కాకుండా ఈమెలో మరో టాలెంట్ కూడా దాగి ఉందని తెలుస్తుంది.

సాయి పల్లవి డాన్స్ అద్భుతంగా చేయడం మాత్రమే కాదు కొరియోగ్రఫీ కూడా చేసిందని తెలుస్తుంది.

Advertisement

సాయి పల్లవి ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఓ సీన్ కోసం, హీరో అతని ఫ్రెండ్స్‌కు సాయి పల్లవి డాన్స్ నేర్పించే సన్నివేశం ఉంటుందట.ఆ సాంగ్‌ని సాయి పల్లవి కొరియోగ్రాఫ్ ( Choreographer ) చేశారని తెలుస్తుంది.

లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాటలో( SarangaDariya Song ) ఆమె ఇన్‌పుట్స్‌ ఉన్నాయని అంటున్నారు.శ్యామ్ సింగరాయ్ ( Shyam Singha Roy ) సినిమాలో ప్రణవాలయ.

పాటకి కూడా సాయిపల్లవినే కొన్ని స్టెప్పులు కంపోజ్‌ చేశారని తెలుస్తుంది ఇలా సాయి పల్లవి కొరియోగ్రాఫర్ గా చేశారని తెలియడంతో తనలో ఇలాంటి టాలెంట్ ఉందా .ఈమె మల్టీ టాలెంటెడ్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు