మిస్ వరల్డ్- మిస్ యూనివర్స్ మధ్య తేడా ఏమిటో తెలుసా?

ఆమధ్య ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

భారత్ నుంచి ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో మహిళగా రికార్డు సృష్టించింది.

అదే సమయంలో జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ ఈ సారి ప్రపంచ సుందరిగా ఎన్నికయ్యింది.ఈ రెండు పోటీలు ప్రపంచంలోని అందమైన మహిళలను గుర్తిస్తాయి.

Do You Know The Difference Between Miss World And Miss Universe , Miss Universe,

అయితే ఈ పోటీల మధ్య వ్యత్యాసం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.ఆ తేడాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వ సుందరి: ఈ పోటీ 1952లో ప్రారంభమైంది.ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్ నగరంలో ఉంది.

Advertisement

ప్రపంచంలో సానుకూల మార్పు కోసం పని చేయండనేది ఈ పోటీ నినాదం.దీని అధ్యక్షుడు పౌలా షుగర్ట్.ఫిన్లాండ్‌కు చెందిన ఆర్మీ కుసేలా తొలిసారి మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది.1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు భారత్ నుంచి టైటిల్ గెలుచుకున్నారు.ప్రపంచ సుందరి: ఈ పోటీ 1951లో ప్రారంభమైంది.ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఉంది.

బ్యూటీ విత్ ఎ పర్పస్ లక్ష్యంగా పనిచేస్తుంది.దీని అధ్యక్షురాలు జూలియా మోర్లీ.1951లో స్వీడన్‌కు చెందిన కికీ హెకెన్‌సెన్ తొలి ప్రపంచ సుందరి.భారతదేశానికి చెందిన 6 మంది మహిళలు మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నారు, వీరిలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు