ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

చాలామంది వైద్య నిపుణులు నడక వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు.

అందుకే ప్రతిరోజు కనీసం ఒక అరగంట నడిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని సూచిస్తూ ఉంటారు.

అదేవిధంగా నడక వల్ల మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది.ఆందోళనగా ఉన్నప్పుడు కొద్ది దూరం నడిస్తే ఆ ఆందోళన తగ్గిపోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

ఎందుకంటే నడక వల్ల శరీరంలో అన్ని అవయవాలు కూడా కదులుతాయి.అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా నడిస్తే నిత్యం ఆరోగ్యంగా ఉంటారు.

అదేవిధంగా చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు.అలాంటి వాళ్ళు బరువు తగ్గించడానికి ఎన్నో డైట్లను, ఎన్నో హోమియో మందులను వాడుతూ ఉంటారు.

Advertisement

కానీ బరువు తగ్గడానికి నడకను ఒక వ్యాయామంగా భావించాలి.అందుకే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ప్రతిరోజు కనీసం ఒక అరగంట నడిస్తే బరువు తగ్గుతారు.

ఎందుకంటే నడవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

దీని ద్వారా బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.నడక వల్ల శరీరంలో ఉండే క్యాలరీలు కరిగిపోతాయి.దీంతో బరువు తగ్గిపోతుంది.

అలాగే మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.ఇక అదే విధంగా చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతూ ఉంటారు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

అలాంటి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు నడిస్తే ఇన్సులిన్ విలువలు నిలకడగా ఉంటాయి.దీని ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Advertisement

అలాగే ప్రతిరోజు నడిస్తే గుండె జబ్బులు కూడా దరికి రావు.అందుకే గుండె ఆరోగ్యానికి ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.ఇక అదే విధంగా చాలామంది యుక్త వయసులోనే కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు.

అందుకే ప్రతి రోజు 30 నిమిషాల పాటు నడిస్తే అంత త్వరగా కీళ్ల నొప్పులు అనేవి రావు.

తాజా వార్తలు