గర్భధారణ సమయంలో ఖర్జూరాలను డైట్ లో చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

గర్భధారణ ( pregnancy )సమయంలో తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యం కోసం సరైన పోషకాలను తీసుకోవడం చాలా అవసరం.

అలాంటప్పుడే తల్లి బిడ్డలు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

అయితే ఖర్జూరం గర్భధారణ సమయంలో గర్భవతికి చాలా మంచిది.ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు కూడా కలిగి ఉంది.

గర్భధారణ సమయంలో నీరసంగా ఉండడం సాధారణం.అయితే ఖర్జూరంలో కార్బోహైడ్రేట్స్, గ్లూకోస్, సుక్రోజ్( Carbohydrates, glucose, sucrose ) లాంటి నాచురల్ షుగర్స్ ఉంటాయి.

దీంతో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.గర్భవతులకు మంచి స్నాక్ అని చెప్పొచ్చు.

Advertisement

ఇది తినడం వల్ల రోజంతా ఆక్టివ్ గా ఉండవచ్చు.

ఖర్జూరంలో ( dates )గర్భవతులకు కావాల్సిన పోషకాలు చాలా ఉన్నాయి.ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ కె బి కాంప్లెక్స్ ఉంటాయి.దీని వలన ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

అంతేకాకుండా అభివృద్ధికి కూడా ఇది తోడ్పడతాయి.ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండడం వలన బాడీలో సెల్యులర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.

అంతే కాకుండా ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్, స్ట్రెస్ ను తగ్గించే ఫ్రీ రాడికల్స్ కూడా ఉంటాయి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అంతేకాకుండా ఖర్జూరం తినడం వలన ఆరోగ్యకరమైన బరువును కూడా నిర్వహించవచ్చు.ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.ఖర్జూరంలో గ్లైసెమిక్స్ ఇండెక్స్ ( Glycemic index )కూడా తక్కువగా ఉంటుంది.

Advertisement

దీంతో షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.అంతేకాకుండా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి.

దీంతో తల్లి బిడ్డల ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడతాయి.అంతేకాకుండా గర్భధారణ సమయంలో డైట్ లో ఖర్జూరాన్ని చేర్చుకుంటే ఏ పోషకాహార లోపం ఉండదు.

గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యలు కూడా ఉండడం వలన హార్మోన్ల మార్పుల వలన మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.డేట్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

తాజా వార్తలు