'ఈ-సిమ్‌' ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా?

సిమ్‌ కార్డు అంటే తెలియనివారు ఈ ప్రపంచంలోనే వుండరు.సెల్ ఫోన్లలో ఉపయోగించే SIM (సబ్ స్కైబర్ ఐడెంటిటీ మాడ్యూల్) ఇక కనబడదు.

అదేంటి, కనబడకపోతే ఎలా అని అనుకుంటున్నారా? దానికి ప్రత్యామ్నాయమే ఈ-సిమ్‌. అవును, సిమ్ కార్డు మొదటిలో పెద్ద సైజు ఉండేది.అక్కడి నుండి నానో, ఆఖరికి మైక్రో సైజుకు వచ్చేసింది.

ఇకపోతే రాబోయే రోజుల్లో కంటికి కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోనుంది ఈ సిమ్ కార్డు.నేటి దైనందిత జీవితంలో అప్డేటెడ్ సెల్ఫోన్లు, వాచ్లతో పాటే ఈ-సిమ్లూ విస్తృతంగా వినియోగంలోకి రానున్నాయి.

ఈ-సిమ్‌ అనేది కొన్ని సంవత్సరాల క్రితమే మార్కెట్లోకి వచ్చినా.అంతగా ప్రాచుర్యం పొందలేదు.కానీ ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ఇపుడు ఈ సిమ్పై ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement

మొబైల్ స్టోర్ కి వెళ్లకుండానే SMS, ఈ-మెయిల్ ద్వారా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండడం దీని ప్రత్యేకత.టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎంత జాగ్రత్తగా వున్నా ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

వాటిలో చాలా వరకు సిమ్ స్వాప్ మోసాలకు సంబంధించిన కేసులు కావడం గమనార్హం.

ఇక ఈ-సిమ్‌ కార్డు వలన మోసాలకు తావుండదు.ఈ-సిమ్‌ వాడుతున్నప్పుడు సిమ్ పోయిందని లేదా పాడైపోయిందని నెట్ వర్క్ ప్రొవైడరుకి ఫిర్యాదు చేయడానికి వీలుపడదు.ఒకవేళ ఎవరైనా అలా చేస్తే.

వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది.ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్-14 మోడల్స్ లో సిమ్ స్లాట్స్ లేవు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఇవి ఈ-సిమ్‌ ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి.వీటిని సులభంగా యాక్టివేట్ చేయడంతో పాటు డి-యాక్టివేట్ కూడా చేయవచ్చు.

Advertisement

ప్రపంచంలో మొట్టమొదట ఈ-సిమ్‌ ని 2016లో శామ్సంగ్ గేర్ ఎస్2 3జీ స్మార్ట్వచ్ కోసం అందుబాటులోకి తెచ్చారు.అనంతరం 2017లో యాపిల్ స్మార్ట్ వాచ్ కూడా దీన్ని ప్రవేశపెట్టారు.

తాజా వార్తలు