లక్ష్మీ దేవి ఏ యుగంలో ఏ అవతారం ఎత్తిందో తెలుసా?

ఆదిశేషుడుపై హాయిగా సేద తీరుతూ పడుకున్న శ్రీ మహా విష్ణవు పాదాల చెంత… ఎప్పుడూ ఎంతో భక్తి శ్రద్ధలు ప్రేమతో సేవ చేసే లక్ష్మీ దేవి… శ్రీ మహా విష్ణవుతో పాటు పలు యుగాల్లో పలు అవతారలను ఎత్తింది.

ఏ యుగంలో అయినా సరే ఆ మహా విష్ణువు భార్యగానే ఉంటూ ఆయనకు సపర్యలు చేసింది.

ఇప్పుడు ఆమె ఎత్తిన అవతారాలు ఏంటో మనం తెలుసుకుందాం.విష్ణు దేవేరి అయిన లక్ష్మి దేవి… త్రేతాయుగంలో రామాయాణంలో శ్రీ రామ చంద్రుడి భార్య సీతగా అతారం ఎత్తింది.

ద్వాపర యుగంలో మహా భారతంలో శ్రీ కృష్ణ పరమాత్ముడి భార్య రుక్మిణీ దేవిగా అవతారం ఎత్తింది.ఆ తర్వాత కలియుగంలో వేంటకేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతరించింది.

ఇలా ఏ యుగంలో అయినా ఆ మహా విష్ణువు భార్యగా.భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రతీతి చెందింది.

Do You Know Laxmidevi Forms In All Yugas, Laxmidevi , Sitadevi , Padmavathi , D
Advertisement
Do You Know Laxmidevi Forms In All Yugas, Laxmidevi , Sitadevi , Padmavathi , D

ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం రెండో శుక్రవారం వర మహాలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు.దీపావళి పండుగ అప్పుడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు.శ్రీ అనే పదం సిరి అనే పదానికి సమానం.

అనగా సంపద, ఐశ్వర్యం ప్రసాదించే దేవత అని లక్ష్మీ దేవత పేరుకు అర్థం.అందుకే మనకు ఏం కావాలన్నా ముందుగా అమ్మవారికి పూజ చేయడం ఆనవాయితీ.

పిల్లలు, ధనం, ధాన్యం, ధైర్యం, సంతానం, విద్య, ఐదోతనం… ఇలా ఏది కావాలన్నా లక్ష్మీ దేవిని పూజిస్తుంటాం.

జుట్టు బాగా రాలుతుందా.. వర్రీ వద్దు పైసా ఖర్చు లేకుండా ఇలా చెక్ పెట్టండి!
Advertisement

తాజా వార్తలు