Jr ntr : జూనియర్ ఎన్టీఆర్ కి ఇన్ని భాషలలో గట్టి ప్రావీణ్యం ఉందా ?

తారక్( Jr ntr ) నటనలో ఇరగదీస్తాడు.అలాగే వాగ్దాటిలో లో అతనిని మించిన నటుడు లేడు.

డాన్సులు, ఫైట్స్ అతడి తర్వాతే ఇండస్ట్రీలో ఎవరైనా, అయితే ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్తే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది, ఎలాంటి యాస అయినా చాలా స్పష్టంగా పలకడంలో ఎన్టీఆర్ దిట్ట.తెలుగులోనే రకరకాల యాసలను తన సినిమాలలో ప్రయోగించాడు.

అరవింద సమేతలో రాయలసీమ భాష మాట్లాడితే రామాచారిగా అదుర్స్ సినిమా( Adhurs )లో బ్రాహ్మణుడి భాష మాట్లాడారు.ఇలా రకరకాల యాసలు, భాషలు ఆయన ఎప్పుడో పట్టేశారు.

అయితే ఇలా ఒక భాషలోకి యాసలోకి దిగడం అంత ఈజీ ఏమీ కాదు.దానికి చాలా కష్టం పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

అయితే ఎన్టీఆర్ ఇది మాత్రమే కాదు ఆయన దాదాపు తొమ్మిది భాషలు చాలా స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడగలడం అతడి స్ట్రాంగ్ పవర్ ని చూపిస్తుంది.

ఎన్టీఆర్ తెలుగులోనే రకరకాల యాసలు మాత్రమే మాట్లాడుతాడు అనుకుంటే పొరపాటు ఆయన తెలుగుతో పాటు మరో ఎనిమిది భాషలను కూడా చాలా బాగా మాట్లాడగలడు.అందులో హిందీ, ఉర్దూ మన తెలంగాణలో పుట్టి పెరిగాడు కాబట్టి బాగా నేర్చుకున్నాడు తారక్.ఇక అలాగే తమిళ్ కన్నడ భాషలను గుక్క తిప్పుకోకుండా కూడా మాట్లాడగలడు.

ఈ రెండు భాషలలో అప్పుడప్పుడు పబ్లిక్ స్పీచ్ లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.రిషబ్ శెట్టి( Rishab Shetty ) తో కన్నడలో మాట్లాడి కన్నడ వారిని ఓన్ చేసుకున్నాడు.

అలాగే చాలాసార్లు తమిళ్లో కూడా మాట్లాడాడు.ఇది కాకుండా సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్ళినప్పుడు జపనీస్ మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఎన్టీఆర్ ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా ఉంటుంది.అతను మాట్లాడుతుంటే అలాగే వినాలని అనిపిస్తుంది.చిన్నతనం నుంచి స్పానిష్ కూడా నేర్చుకున్నాడట తారక్.

Advertisement

ఇలా తొమ్మిది భాషలను గుక్క తిప్పుకోకుండా మాట్లాడటంలో నేర్పరి.ఇలా ఎన్ని భాషలు మాట్లాడగలిగే తెలుగు హీరో తారక్ తప్ప మరొకరు లేరు.

ఇలా ఇన్ని భాషలు నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే భాష తెలియకుండా ప్రేక్షకుల ప్రేమను పొందలేము అని అనుకున్నాడో ఏమో కానీ సినిమా వరకే అతనికి అన్ని భాషలు వచ్చు.అలాగే అన్ని రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ చేయడానికి వెళ్లి వారి భాషల్లో వారికి స్పీచ్ ఇచ్చి వారి సొంత ఇంటి వ్యక్తిలా మారిపోయాడు.

తాజా వార్తలు