మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?

మైదా పిండి( Maida Flour ) ఆరోగ్యానికి మంచిది కాదని ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాము.కానీ మైదా పిండిని తినడం మాత్రం తగ్గించరు.

స్వీట్స్ నుంచి హాట్స్ వరకు మైదాతో రకరకాల ఐటమ్స్ తయారు చేస్తుంటారు.కేక్స్, కాజాలు, పరోటా, రుమాలీ రోటీ, జిలేబీ, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటల్లో మైదాను ప్ర‌ధానంగా ఉప‌యోగిస్తారు.

ఇవి తినడానికి రుచిక‌రంగా ఉన్నా ఆరోగ్యానికి అస్స‌లు మంచివి కావు.కాసేపు ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.? ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు.? అని ఎప్పుడైనా ఆలోచించారా.? సాధారణంగా బియ్యం నుంచి బియ్యం పిండి, రాగుల నుంచి రాగి పెట్టి, గోధుమల‌ నుంచి గోధుమ పిండి, జొన్నల నుంచి జొన్న పిండి వస్తాయి.మరి మైదా పిండి ఎలా తయారవుతుంది అంటే అది కూడా గోధుమ‌ల నుంచేనండి.

Advertisement
Do You Know How To Make Maida Flour Details, Maida Flour, Maida Flour Side Effe

కానీ గోధుమ‌ల‌ నుంచి గోధుమ పిండి తయారీకి, మైదా పిండి తయారీకి ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది.

Do You Know How To Make Maida Flour Details, Maida Flour, Maida Flour Side Effe

ఎలాంటి రసాయనాలు క‌ల‌ప‌కుండా గోధుమలను( Wheat ) నేరుగా మిల్లులో వేసి గోధుమ పిండి చేస్తారు.గోధుమలపై ఉన్న పై పొరలన్నీ తొల‌గించి బాగా పాలిష్ చేసి మైదా పిండిని త‌యారు చేస్తారు.ఈ ప్రాసెస్ లో అజో డై కార్బొనమైడ్, బెంజైల్ పెరాక్సైడ్ వంటి ఎన్నో రసాయనాలను ఉపయోగిస్తారు.

మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగా, చూడటానికి తెల్లగా ఉంటుంది.ఇందుకు కార‌ణం అందులో ఉండే అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనమే.

Do You Know How To Make Maida Flour Details, Maida Flour, Maida Flour Side Effe

మైదా పిండి వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు సూన్యం.న‌ష్టాలు మాత్రం దండిగా ఉంటాయి.మైదాలో ఫైబర్( Fiber ) తక్కువగా ఉంటుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

అందువ‌ల్ల మైదా మలబద్ధకం, ఉబ్బరం, ప్రేగులలో అసౌకర్యం మరియు ఊబకాయం కలిగిస్తుంది.మైదాలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్( Glycemic Index ) ఉంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

Advertisement

అందువ‌ల్ల‌ మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి మైదాను అస్స‌లు సిఫార్సు చేయ‌రు.అంతేకాకుండా మైదా పిండిని నిత్యం లేక అధికంగా వాడటం వల్ల గుండె జబ్బులు, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి.

తాజా వార్తలు