పెద్దవాళ్లకు మరియు దేవతలకు ఎలా నమస్కరించాలో తెలుసా..

ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న పిల్లలకు పెద్దవారిని ఎలా గౌరవించాలో అసలు తెలియడం లేదు.

ఎందుకంటే రాను రాను గౌరవ మర్యాదలు అనేవి అసలు ఎవరి దగ్గర కూడా లేవు.

నమస్కారం అనేది మన సంస్కృతి.ఇది ఒక గౌరవ సూచకం తల్లిదండ్రులకు, గురువులకు, అతిథులకు అందరికంటే ముఖ్యంగా పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తూ ఉండాలి.

మంచి నమస్కారం ఎలా ఉండాలంటే మనసు నిండా గౌరవాన్ని నింపుకొని వినయం, విధేత ఉట్టిపడేలా అవతలి వారి హృదయాన్ని తాకేలా ఉండడం మంచిది.శివునికి, విష్ణువుకు నమస్కరించేటప్పుడు తలవంచి 12 అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.

శివ కేశవులు ఏ భేదం లేదని చెప్పడానికి ఇది గుర్తు వారికి తప్ప మిగతా దేవతలకు శిరస్సు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.గురువుకు నమస్కారం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కారం చేయడం ఉత్తమం.

Advertisement

తండ్రికి ఇతర పెద్దవారికి నేరుకు ఎదురుగా చేతులు జోడించి నమస్కరించాలి.తల్లికి నమస్కరించినప్పుడు ఛాతికి ఎదురుగా చేతులు జోడించి నమస్కరించడం ఉత్తమం.

యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించడం మంచిది.నమస్కారంలోని అంతర్గతం భారతీయ హిందూ సంస్కృతిలో నమస్కారం అనేది ఒక విశిష్ట ప్రక్రియ అనే చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే అనునిత్యం దేవాలయానికి వెళ్లి దైవ ప్రదర్శన చేసే వాళ్ళు కొందరైతే పర్పదినాల్లో విశిష్టమైన రోజుల్లో మాత్రమే దేవాలయానికి వెళ్లి స్వామివారికి

పూజలు, అభిషేకాలు జరిపించే వాళ్ళు మరికొందరు దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు.అయితే ఈ సమయంలో భక్తులు స్వామి వారికి ఎదురుగా నుంచొని ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు.అలా కాకుండా భక్తులు ఒక వైపున పక్కకి నిలబడాలని ఆధ్యాత్మిక గ్రంధాలలో ఉంది.

గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి వుండి పూజాభిషేకాలు చేసి హారతి ఇస్తూ ఉంటారు.ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో అలాగే భగవంతునికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు ఒక పక్కకు నిలబడి నమస్కరించడం మంచిది.

Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.
Advertisement

తాజా వార్తలు