డెబిట్ కార్డు లేకున్నా కూడా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు తెలుసా..?!

ప్రస్తుత కాలంలో అందరూ కూడా ఎక్కువగా డిజిటల్ ప్రెమెంట్స్ పై ద్రుష్టి సారించారు.

అలాగే డిజిటల్ పేమెంట్స్‌ సంస్థలు కూడా చాలా రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

చిన్న టీ కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద దుకాణాల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ పై మొగ్గు చూపుతున్నారు.అయితే ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలంటే తప్పనిసరిగా వినియోగదారుడికి డెబిట్ కార్డు ఉండాలి.

అయితే డెబిట్ కార్డు లేని కారణంగా ఇప్పుడు చాలా మంది డిజిటల్ పేమెంట్‌ సేవలను పొందలేకపోతున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, కిరాణా షాపుల వాళ్ళకి డిజిటల్‌ పేమెంట్స్‌ గురించి అవగాహన ఉన్నాగాని వారికీ డెబిట్‌ కార్డు లేక అన్ని సేవలను పొంద లేకపోతున్నారు.

అయితే ఇప్పుడు ఆ సమస్యకి చెక్ పెట్టారు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వాళ్ళు.అంటే ఇకమీదట డెబిట్‌ కార్డు లేకున్నా గాని యూపీఐ సేవలను పొందే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించనుంది.

Advertisement

ఇప్పటికే ఎన్‌పీసీఐ కొన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో డిజిటల్‌ లావాదేవీలను అందరికి అందుబాటులోకి తీసుకుని వచ్చే క్రమంలో ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు యుపీఐ సేవలను అందించాలని బ్యాంకులను కోరింది.అయితే డెబిట్ కార్డులేని డిజిటల్ పేమెంట్స్ చేయాలంటే వాళ్ళు బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకి లింకు చేసిన మొబైల్ నెంబర్ రెండు ఒకటే అవ్వాలి.అప్పుడే యూపీఐ సేవలను ఉపయోగించుకోగలుగుతారు.

Advertisement

తాజా వార్తలు