కరోనా ఇమ్యూనిటీ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

గత కొన్ని నెలల నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి విషయంలో రోజుకో కొత్త విషయం వెల్లడవుతుంది.

కంటికి కనిపించని, అంతుచిక్కని ఈ వ్యాధి మానవ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఈ విషయంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ వ్యాధి కోసం అన్ని ప్రపంచ దేశాలతో పోటీపడి వాక్సిన్ కనుగొనే పనిలో ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే కరోనా పై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు దీనిపై మరొక తాజా విషయాన్ని వెల్లడించారు.

Corona Immunity Power In Body, Corona Virus, Immunity, University Of Birmingham,

సాధారణంగా కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల వ్యాధి తీవ్రత నుంచి తొందరగా కోలుకుంటారు.అయితే ఒకసారి కరోనా సోకిన వారి శరీరంలో ఇమ్యూనిటీపవర్ దాదాపు ఆరు నెలల పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

కరోనా వచ్చిన తర్వాత శరీరంలో వస్తున్న మార్పులు రోగనిరోధకశక్తి పై అధ్యయనాలు జరుగుతున్న క్రమంలో ఈ విషయాలు బయటపడ్డాయి.కరోనా వచ్చిన వారిలో సాధారణంగా కణసంబంధ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని, బ్రిటన్ లో జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైందని, ప్రొఫెసర్ పాల్ మోస్ తెలిపారు.

Advertisement

ఒకసారి కరోనా వచ్చిన వారిలో ఇమ్యూనిటీ ఆరు నెలల పాటు ఉండడంవల్ల వారికి మరో ఆరు నెలల వరకు కరోనా వ్యాపించదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇది కొంతవరకు శుభవార్తేనని చెప్పవచ్చు.

అయితే కరోనా ఈ వ్యాధికి సంబంధించి కేవలం కొద్ది పరిమాణంలో మాత్రమే పరిశోధనలు జరిగాయి.ఈ వ్యాధి గురించి ఇంకా చాలా విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయలో కరోనా సోకిన కొందరిలో పరిశోధనలు జరుపగా వారిలో యాంటీబాడీలస్థాయి తగ్గినప్పటికీ, సెల్యులార్ ఇమ్యూనిటీ లో భాగమైన టీ కణాలు స్పందించే తీరు మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు