భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లు తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

ఆరెంజ్, నిమ్మకాయ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.

పైగా సిట్రస్ పండ్లు ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలను చేకూరుస్తాయి.

మంచి చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు, బలమైన రోగనిరోధక శక్తి తదితర ప్రయోజనాల కోసం మీ ఆహారంలో సిట్రస్ పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం.సిట్రస్ పండ్ల యొక్క అన్ని మంచి ప్రయోజనాలను పొందాలనుకుంటే తినే సమయం విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్ల‌ను పొరపాటున కూడా తినకూడదని గుర్తుంచుకోండి.అలా తింటే ఎంతో ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లు తినడం వల్ల వాటిలో ఉండే యాసిడ్ కంటెంట్ మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.జీర్ణక్రియలో అంతరాయాలను కలిగిస్తుంది.

Advertisement

ఇది అజీర్ణం, అసిడిటీ, గుండెల్లో మంటకు దారితీస్తుంది.గ్యాస్, కడుపు నొప్పి( Gas, stomach ache ) వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

అలాగే సిట్రస్ పండ్ల( Citrus fruits )లో సహజ చ‌క్కెర్లు ఉన్నప్పటికీ.భోజనం చేసిన వెంటనే వాటిని తీసుకుంటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.ఇది మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరం.

భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లు తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.సిట్రస్ పండ్లలో కొన్ని సమ్మేళనాలు ఉండటం వలన భోజనం తర్వాత నేరుగా తీసుకున్నప్పుడు పోషకాలను గ్రహించడంలో ఆటంకం ఏర్పడుతుంది.

కాబట్టి భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లను అస్సలు తీసుకోకండి.అలాగే భోజనానికి ముందు కూడా సిట్రస్ పండ్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.భోజనం చేసిన వెంటనే లేదా భోజనానికి ముందు కాకుండా సిట్రస్ పండ్లను ఎప్పుడు తిన్నా ఆరోగ్యమే.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

సిట్రస్ పండ్లు ఇమ్యూనిటీ పవర్( Immunity power ) ను పెంచుతాయి.ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి.రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

Advertisement

బాడీని హైడ్రేటెడ్ గా మారుస్తాయి.మరియు గుండె ఆరోగ్యానికి సైతం అండగా నిలుస్తాయి.

తాజా వార్తలు