'కేజిఎఫ్ చాప్టర్ 1' విలన్ గరుడ గురించి తెలియని రహస్యం ఇదే?

అదృష్టం ఉండాలి కానీ ఎప్పుడు ఎవరు ఏ స్థాయికి వెళతారు అన్నది ఎవరూ ఊహించలేరు.

అవును అదృష్టం చెప్పి రాదు దురదృష్టం చెప్పి పోదు అన్నారు పెద్దలు.

అలాగే అదృష్టం మరీ ఎక్కువ అయితే అదృష్టం నీకు దరిద్రం పట్టినట్టు పట్టిందిరా బాబు అంటుంటారు.మరి ఇన్ని రకాలుగా అదృష్టం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.

విషయం వింటే మీరు కూడా షాక్ అవుతారు.కేజీఎఫ్ చిత్రంలో గరుడ పాత్ర ఏ స్థాయిలో ఆదరణ అందుకుంది అన్నది తెలిసిందే.

గరుడ పాత్రలో గంభీరంగా కనిపించిన నటుడు రామచంద్రరాజు తన గాంభీర్యమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.అయితే ఇతడికి ఇదే మొదటి సినిమా అన్న విషయం మీకు తెలుసా ? అంతే కాదు అసలు ఇతడు నటుడే కాదు అంతకుముందు కనీసం కెమెరా ముందు చిన్న ఎక్స్పీరియన్స్ కూడా లేదు.అతడు హీరో యశ్ కార్ డ్రైవర్ కమ్ బాడీ గార్డ్.

Advertisement

గతంలో ఎపుడు నటించలేదు.అలాంటిది ఒక పాన్ ఇండియా చిత్రంలో కీలకమైన విలన్ పాత్రను అందులోనూ ఫుల్ పవర్ఫుల్ పాత్రను ఇవ్వడం అలాగే ఆ పాత్రను చేయడం అంటే అంత ఈజీ కాదు.

కానీ ఆ క్యాలుకేషన్స్ కి భిన్నంగా అతని పాత్ర హైలెట్ అయ్యింది.అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది అంటే.

దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే హీరో యశ్ మంచి స్నేహితులు ప్రశాంత్ తరచూ కథకు సంబందించిన అంశాలను చర్చించడానికి యశ్ వద్దకు వెళ్తుండేవాడు.ఇద్దరు మంచి గ్లాస్మెట్స్.

పెగ్ వేస్తే కానీ కథ ముందుకు వెళ్లేది కాదట.అలా ఒకరోజు యశ్ దగ్గర కార్ డ్రైవర్ గా పని చేస్తున్న రామచంద్ర రాజును చూసి నువ్వు నా సినిమాలో విలన్ గా చేస్తావా ? కాకపోతే కాస్త గడ్డం బాగా పెంచి బాడీ షేప్ ను కొంచం మార్చాలి అని అన్నారట.ఆయన మనసులో అప్పటికే రామచంద్రరాజును విలన్ పాత్రలో ఊహించుకుని ఒకే అనుకున్నాకే ఆ మాట బయటకు అన్నారు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

కానీ ఆ మాటను విన్న యశ్ అలాగే రామచంద్రరాజు ఇద్దరు షాక్ అయ్యారు , సరదాగా అన్నారు అనుకొని ఒక చిన్న నవ్వు నవ్వి మళ్ళీ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోయారు.అయితే రామచంద్ర రాజు దర్శకుడు అలా అన్నారు అంటే ఎదో ఒక చిన్న అవకాశమైనా ఇవ్వకు పోతారా.అనుకుని గడ్డం పెంచుతూ రోజు జిమ్ కి వెళ్లి బాడీని పెంచే పనిలో పడ్డారు.

Advertisement

కట్ చేస్తే నిజంగానే ఒకరోజు ప్రశాంత్ నీల్ రామచంద్ర రాజును షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చి యాక్ట్ చేయమని అడిగారు, అనుకున్న మార్క్ అతడిలో కనిపించడంతో.

హీరో దగ్గరకు వెళ్ళి యశ్ ఇకపై నీకు కార్ డ్రైవర్ ఉండడు కొత్త డ్రైవర్ ని వెతుక్కోవాల్సిందే అన్నారట ప్రశాంత్. అందుకు యశ్ ఖచ్చితంగా రామచంద్ర రాజుకు మంచి లైఫ్ ఇస్తానంటే అంతకుమించి ఏం కావాలి అన్నాడట.దాంతో ప్రశాంత్ విలన్ పాత్రకు అతడిని ఫైనల్ చేసేసారు.

ఇక్కడ యశ్ కానీ తన కార్ డ్రైవర్ తో సినిమా చేయడం ఏంటి ఏ కొంచం నామోషీగా ఫీల్ అయినా నేడు గరుడ పాత్రలో రామచంద్ర రాజు ఉండేవాడు కాదు.అలాగే యాక్టింగ్ లో ఏమాత్రం అనుభవం లేని ఒక కార్ డ్రైవర్ ని అంత పెద్ద పాత్రకు నమ్మి అవకాశం ఇచ్చారు అంటే ప్రశాంత్ నీల్ డెసిషన్ ని అలాగే తన పై తనకు ఉన్న నమ్మకాన్ని మెచ్చుకోవలసిందే.

తాజా వార్తలు