తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే క్యారెట్ తో ఇలా చేయండి!

ఇటీవల రోజుల్లో ఎంతో మంది తక్కువ వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.తెల్ల జుట్టును దాచుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతున్నారు.

అయితే తెల్ల జుట్టు వచ్చాక ఇబ్బంది పడే కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మేలు.మీరు కూడా తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారా.? అయితే మీ డైట్ లో క్యారెట్ జ్యూస్( Carrot juice ) ఉండాల్సిందే.క్యారెట్ కళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటే పొరపాటే అవుతుంది.

క్యారెట్ మన జుట్టు సంరక్షణకు సైతం సహాయపడుతుంది.క్యారెక్టర్ లో ఉండే బి12 మరియు ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.అలాగే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి త‌గ్గ‌కుండా హెల్ప్ చేస్తాయి.

తద్వారా తెల్ల జుట్టు ( white hair )రాకుండా ఉంటుంది.అందుకే వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు అయినా క్యారెట్ జ్యూస్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Advertisement

అయితే క్యారెట్ జ్యూస్ తయారు చేసుకునే సమయంలో నాలుగు కరివేపాకు ఆకులు( Curry leaves ) మరియు రెండు గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసిన ఉసిరికాయలు( amla ) వేసుకుని మిక్సీ పట్టి తాగితే ఇంకా మంచిది.ఇక తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలని భావించేవారు ఈ క్యారెట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం తో పాటు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులను వాటర్ లో వేసి నైట్ అంతా నానబెట్టుకోండి.మరుసటి రోజు ఆ నువ్వులను మిక్సీ జార్ లో మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే వయసు పైబడిన కూడా మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.అలాగే కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు