దుర్గమ్మ కు పూజలు నిర్వహించిన మహిళలు ఎక్కడో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే గృహప్రవేశం, బారసాల, వివాహం ఏ వేడుక అయినా, ఏ పూజ కార్యక్రమం అయినా మగ పూజారులే ఎక్కువగా ఉంటారు.

అయితే ప్రస్తుత సమాజం మారింది అని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే మగవాళ్లకు మాత్రమే పరిమితం అనుకునే పరోహిత్యంలో ఆడవారు కూడా అడుగుపెడుతున్నారు.అడుగుపెట్టడమే కాదు ఏమాత్రం తడుముకోకుండా మంత్రాలు చదువుతూ శాశ్వతంగా వివాహాలు, పూజాతి కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉన్నారు.

అందుకు ఈ నలుగురు మహిళలే కారణమని చెప్పవచ్చు.

నందిని భౌమిక్, రుమారాయ్, సేమంతి బెనర్జీ పౌలోమి చక్రవర్తి( Semanti Banerjee Paulomi Chakraborty ) అనే నలుగురు మహిళా పూజారులు కొలకత్తా దుర్గామాత పూజ జరిపించారు.మంత్రాలు చదువుతూ మేళా తాళాలు కొడుతూ పూజలు చేశారు.శక్తి స్వరూపిణి ఆయన దుర్గాదేవికి మహిళా పూజారులు పూజ జరిపించారు.66 తల్లి దుర్గ పూజా కమిటీ తరపున దుర్గా పూజ( Durga Puja ) జరిపించే మగ పూజారి చనిపోవడంతో మహిళా పూజారులకు అవకాశం ఇవ్వాలని నిర్వాహకులు భావించారు.మహిళా పూజారులు అమ్మవారిని పూజించారు.

Advertisement

వీరికి హిందూ ఆచారాలు పూజా విధానాలపై మంచి అవగాహన ఉంది.శుభమస్తు ఆర్గనైజేషన్ నడుపుతూ హిందూ మహిళ పూజల గురించి, దేవుళ్ళ గురించి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా మీరు ఇస్తున్నారు.

సాంస్కృతం ప్రొఫెసర్ గా పని చేసిన డ్రామా ఆర్టిస్ట్ నందిని భౌమిక్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు.ఇప్పటికీ వీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.మహిళలు అనంతమాత్రాన వారిని ప్రధాన పూజారులుగా ఎక్కడ తీసుకోవద్దని చెప్పలేదు.

మహిళలు వాళ్ళ పూజకు అవసరమైనవి తెచ్చుకుని పూజ చేస్తారు.కొందరు మహిళలు మట్టితో దేవత విగ్రహాలను తయారు చేస్తారు.

మరి అలాంటప్పుడు మహిళలు పూజారులుగా ఉంటే తప్పేంటి అని వీరు చెబుతున్నారు.దుర్గామాత పూజకు సంబంధించి పూర్తి వివరాల కోసం పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, హిందూ సాహిత్యం ( Hindu literature )మొదలైన వాటిని చదివామని మహిళా పూజారి నందిని తెలిపారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై16, మంగళవారం 2024

పాటలు శ్లోకాలను వివరిస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా తము పూజలు చేస్తున్నామని కూడా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు