Srirama katha : ఆదిపురుష్‌ లాంటి చెత్త సినిమాని 50 ఏళ్ల క్రితమే తీశారు.. అది ఏంటంటే…

శ్రీరాముడి జీవిత చరిత్ర ఆధారంగా మన ఇండియాలో ఎన్నో సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని ప్రేక్షకులను మెప్పు పొందితే, మరికొన్ని చాలా నిరుత్సాహపరిచాయి.

ఉదాహరణకి ఆదిపురుష్‌( Adi purush ) అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమాకి ఒక అర్థము అంటూ ఏదీ లేదు.అందువల్ల ఇది ఫెయిల్ అయింది.

అయితే ఆదిపురుష్ కంటే ముందే అంటే 1969 లోనే ఇలాంటి మరొక చెత్త సినిమా కూడా వచ్చింది.దీనిని క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ పద్మనాభం స్వయంగా డైరెక్ట్ చేశాడు.

ఆ సినిమా పేరు "శ్రీరామకథ( Srirama katha )".ఈ మూవీ తోనే పద్మనాభండైరెక్టర్‌గా అవతరించాడు.

Advertisement

పద్మనాభం తమ్ముడు బి.పురుషోత్తం ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు.భక్తి గొప్పదా? రక్తి గొప్పదా? అని నారదుడు ఈ సినిమాలో త్రిమూర్తులను, అష్టదిక్పాలకులను ప్రశ్నిస్తాడు.అంతేకాదు శ్రీదేవికి, భూదేవికి మధ్య చిచ్చు పెట్టి వారు ఒకరికొకరు శపించుకునేలా ప్రేరేపిస్తాడు.

తర్వాత నారదుడు భూలోకంలో జన్మిస్తాడు.భూదేవిని అతడితో పాటు అతడి మేనల్లుడు కూడా ప్రేమిస్తాడు.

వారి ప్రేమ వైఫల్యానికి శ్రీహరి కారణమవుతాడు.దాంతో విష్ణువును నారదుడు శపిస్తాడు.

దీనివల్ల శ్రీరాముడు సీత విడిపోతారు.సింపుల్ గా చెప్పాలంటే ఇదే సినిమా కథ.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ఈ మూవీకి ప్రముఖ రచయిత వీటూరి కథ, మాటలు, పద్యాలు అందించారు అయితే ఈ కథను వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నారా? లేదా ఇంకా ఏదైనా రామాయణం నుంచి తీసుకున్నారా అనేది ఎవరికీ అర్థం కాలేదు.ఇందులో హరనాథ్, శారద, జయలలిత, చిత్తూరు నాగయ్య, పి.హేమలత, నిర్మలమ్మ, కె.మాలతి, ముక్కామల, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీ దేవి,పద్మనాభం, చంద్రమోహన్, గీతాంజలి, రేలంగి, సూర్యకాంతం, బాలకృష్ణ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు.ఈ స్టార్ స్టడెడ్ క్యాస్ట్ తో పాటు పద్మనాభం డైరెక్షన్( Padmanabam ) లో వచ్చిన మొదటి మూవీ కాబట్టి దీన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు కానీ కథ బాగా పోవడంతో తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.

Advertisement

పద్మనాభం తొలి డైరెక్టర్ రియల్ మూవీ తోనే ఫెయిల్ అయిపోయాడు.ఈ పౌరాణిక సినిమాల జోలికి వెళ్లకుండా వేరే కామెడీ సినిమాలు తీసి ఉంటే అతడు ఒక హిట్ అందుకునేవాడు.

ఇక ఈ మూవీని ఆదిపురుష్ సినిమాతో ఎందుకు పోల్చామో తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఉన్న ఫుల్ మూవీ ని చూడండి.

తాజా వార్తలు