ప్రతీ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి మీకు తెలుసా?

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతీ పదిమందిలో కనీసం 8 మందికి పైగా ఎక్కువగా స్మార్ట్ మొబైల్స్ వాడుతున్నారని ఓ సర్వే.

అయితే వారిలో దాదాపు ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే స్మార్ట్ మొబైల్ గురించి పూర్తి అవగాహన ఉంటోంది.

మిగతావాళ్లంతా చాలా గుడ్డిగా మొబైల్స్ వాడుతూ వుంటారు.వారికీ వివిధ ఫీచర్ల గురించి అవగాహనే ఉండదు.

కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే మొబైల్స్ ను వాడితే మరి కొంతమంది వారి యొక్క పనులను చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.మీరు ఎప్పుడైనా స్మార్ట్ మొబైల్ వెనుక వైపు కెమెరాల మధ్యలో అలాగే ఫ్లాష్ లైట్ దగ్గర ముందు బాగాన లేదా పక్కన చిన్నపాటి రంధ్రం ఉండడం గమనించారా? ఆ రంద్రం ఎందుకు వుందో ఎపుడైనా ఆలోచించారా? తెలియకపోతే ఇపుడైనా తెలుసుకోండి.మనం వాడే వస్తువులమీద ఆమాత్రం అవగాహన ఉండాలి.

ఆ రంధ్రం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.స్మార్ట్ మొబైల్స్ మార్కెట్లో విడుదలైన కొత్త మొబైల్స్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక రకమైన శబ్దాలు వినిపిస్తుందని అందువల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించడం లేదని ఎంతోమంది తెలియజేస్తూ ఉంటారు.

Advertisement

దాన్నే నాయిస్ డిస్ట్రబెన్స్ అని అంటారు.అయితే మొదట వచ్చిన మొబైల్స్ కు అలాంటి సమస్య రాలేదు మళ్లీ.

ఇప్పుడు వస్తున్న సరికొత్త మొబైల్స్ కు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉందని పలువురు యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు.దానికి కారణం ఆ రంద్రం దగ్గర చెయ్యి ఉంచడం కానీ లేదా రంద్రం డస్ట్ తో నిండిపోవడం వంటివి జరగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.

ఇక ఆంద్రం దగ్గర మినీ మైక్రోఫోన్ అనేది ఉంటుంది ఇది నాయిస్ క్యాన్సిలేషన్ డివైస్ గా పని చేస్తుంది.దీనివల్ల ఫోన్ చేసినప్పుడు మనకు ఎలాంటి అంతరాయం లేకుండా అవతలి వారి మాటలు స్పష్టంగా వినిపిస్తాయి.

తెలియనివాళ్లకు ఈ విషయం తెలియజేయండి.

మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు