బ్రో సినిమాలో మార్క్ చెల్లిగా నటించిన అమ్మాయి అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ తెలుసా?

టాలీవుడ్ ( Tollywood )చిత్ర పరిశ్రమలో తాజాగా రిలీజ్ అయిన సినిమా బ్రో - ది అవతార్( Bro - The Avatar ) మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధర్మ తేజ( Pawan Kalyan - Sai Dharma Teja ) కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ నమోదు చేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా ఏ రేంజ్ లో చూడాలి అనుకున్నారో.

అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని చూపించడంలో సక్సెస్ అయ్యారు సముద్రఖని.మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ సెంటిమెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం గా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లిగా నటించిన అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ సినిమాలో నటించిన కేతిక శర్మ , ప్రియా ప్రకాష్ వారియర్( Ketika Sharma, Priya Prakash Warrier ).గురించి అందరికీ తెలిసినదే.కానీ సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలు గా నటించిన అమ్మాయి నటన బాగుండడంతో అమ్మాయి ఎవరా? అంటూ తెగ వెతికేస్తున్నారు మెగా ఫాన్స్.ఈ క్రమంలోనే ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిసి షాక్ అయిపోతున్నారు .అవును, ఈమె తమిళంలో స్టార్ హీరోయిన్.ఎన్నో సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఈ అమ్మాయి పేరు యువ శ్రీ లక్ష్మి.కాగా ఇపుడు ఈ హీరోయిన్ నటన చూసి చాలా మంది తెలుగు జనాలు మెచ్చుకుంటున్నారు.

అందుకనే సముద్రఖని( Samudrakhani ) ఈ అమ్మాయిని ఏరి కోరి మరీ ఈ పాత్రకు ఎంచుకున్నారు.బ్రో సినిమాలో యువ శ్రీ లక్ష్మీ పాత్ర నటన చాలా బాగుండడంతో తెలుగులో ఆఫర్లు కూడా ఇపుడు వెలువెత్తుతున్నాయి.త్వరలోనే ఈమె మరిన్ని స్టార్ హీరో సినిమాలలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

చూద్దాం మరి ఈ హీరోయిన్ తెలుగులో ఏ స్థాయికి వెళుతుందో.కాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో విశ్వరూప దర్శనం ఇచ్చాడని ఎంతమందికి తెలుసు?.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు